తెలంగాణ

వైద్యం అందక విద్యార్థి బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ సికింద్రాబాద్, సెప్టెంబర్ 19: రాష్ట్ర రాజధానిలోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు బతకడనుకున్న వాళ్లను కూడా బతికించిన చరిత్ర ఉంది. అలాంటిది అత్యవసర వైద్యం అందిస్తే బతికే అవకాశాలున్న విద్యార్థి మాత్రం, నిర్లక్ష్యం కారణంగా కన్నుమూసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా రాజాపేట మండలం బేగంపేటకు చెందిన ఐటీఐ విద్యార్థి ల్యాగాల ప్రకాశ్‌తో పాటు మరో ఐదుగురు జగదేవ్‌పూర్ మండలం పరిధిలోని మదనదుర్గమ్మ దేవాలయం వద్ద ఆదివారం రాత్రి పార్టీ చేసుకున్నారు. పార్టీ అనంతరం స్నేహితులంతా తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణమైన ల్యాగాల ప్రకాశ్ సోమవారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో జగదేవ్‌పూర్ రోడ్డు మలుపులో ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. గాంధీలో సిటి స్కాన్ పని చేయకపోవడంతో, ఉస్మానియాకు వెళ్లాలని వైద్యులు సూచించారు. దాంతో ప్రకాశ్‌ను ఉస్మానియాకు తీసుకెళ్లినట్టు కుటుంబీకులు చెబుతున్నారు. అక్కడ ఆక్సిజన్ బెడ్లు ఖాళీ లేవని, తిరిగి గాంధీకే తీసుకెళ్లాలన్న వైద్యుల సూచనతో గాంధీకి వస్తుండగా, మార్గమధ్యలో ప్రకాశ్ ప్రాణాలు విడిచాడు. క్షతగాత్రుడిని సకాలంలో అసుపత్రికి తీసుకొచ్చినా వైద్యుల నిర్లక్ష్యం, ఆసుపత్రిలో కనీస సదుపాయాలు కరవుతో ప్రకాశ్ ప్రాణాలు కోల్పోయాడని బంధువులు గాంధీ అసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. సంఘటనపై తమకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
గాంధీలో కొత్త సిటి స్కాన్‌కు టెండర్లు
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కొత్త సిటి స్కాన్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం టెండర్లు సైతం ఆహ్వానించిందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాల పాలై చికిత్స కోసం గాంధీ ఆసుపత్రి నుంచి ఉస్మానియాకు తీసుకెళ్లమని చెప్పలేదని ఆయన అన్నారు. దీంతో గాంధీ అసుపత్రి వైద్యులు, మృతి చెందిన ప్రకాశ్ కుటుంబీకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది