తెలంగాణ

మీ చరిత్ర గురించి చెప్పాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ‘తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం నిర్వహణపై మాట తప్పిన మీ చరిత్ర గురించి, మీ మోసపూరిత చరిత్ర గురించి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడాలా?..’ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ రాష్ట్ర మంత్రి హరీశ్ రావును ప్రశ్నించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై డాక్టర్ లక్ష్మణ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఏ చరిత్ర గురించి మాట్లాడాలని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కెసిఆర్ గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించిన సిడీలను ప్రదర్శించారు. మజ్లిస్ పార్టీకి భయపడే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు అన్నట్లు కెసిఆర్ ఎవరికీ భయపడకపోతే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మొండి అయితే బిజెపి జగమొండి అనే విషయాన్ని తెలుసుకోవాలని ఆయన తెలిపారు. అధికారికంగా నిర్వహించేందుకు ఉన్న ఇబ్బంది ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘మీ చరిత్ర తప్ప కాకతీయలు, రెడ్డి రాజులు, తెలంగాణ విమోచన కోసం అమరులైన వారి చరిత్ర గురించి భవిష్యత్తుతరాలకు తెలియకూడదా?’ అని ఆయన ప్రశ్నించారు.
అసెంబ్లీని సమావేశపరచండి
తెలంగాణ రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం విడుదల చేసిన 90 వేల కోట్ల రూపాయల గురించి అసెంబ్లీలో చర్చకు పెట్టండన్నారు. ఐడిపిఎల్ పునరుద్ధరణకు 900 కోట్లు కేటాయించడం, 716 కోట్ల రూపాయలు కరవు సహాయంగా ఇవ్వడం గురించి ఆయన ఉదహరించారు. ఎస్‌సి, ఎస్‌టి నిధులు ఎందుకు దారి మళ్లిస్తున్నారని ప్రశ్నించారు.
ఫిరాయింపులపై టిఆర్‌ఎస్ ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నదని ఆయన విమర్శించారు. టిఆర్‌ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయిస్తే తీవ్రంగా స్పందించిన కెసిఆర్ ఇప్పుడు ఏమి చేస్తున్నారో, 63 నుంచి 90 మంది ఎమ్మెల్యేలు ఎలా అయ్యారో ప్రజలు చూస్తున్నారని ఆయన తెలిపారు.