తెలంగాణ

5వేల కోట్లతో నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: పరిస్థితులను బట్టి ముఖ్యమంత్రి ఇచ్చే అత్యవసర హామీలు తక్షణం అమల్లోకి వచ్చేందుకు వీలుగా బడ్జెట్‌లో ప్రత్యేక నిధి ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి పేరిట 5వేల కోట్లతో ఏర్పాటయ్యే ఈ నిధిని, ఆయన పర్యటనల్లో అక్కడికక్కడ ఇచ్చే హామీలు ఆలస్యం కాకుండా నెరవేర్చేందుకు నిధులు వెచ్చిస్తారు. ఇదిలావుంటే, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 29 నుంచి నిర్వహించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. తొలుత జనవరి చివరి నుంచి సమావేశాలు నిర్వహించి కేంద్ర బడ్జెట్‌కన్నా ముందే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, తరువాత నారాయణఖేడ్ ఎన్నికలతో పాటు అధికారులు ముందుగా అనుకున్నట్టు బడ్జెట్ రూపకల్పనకు సంబంధించిన లెక్కలు తేల్చకపోవడంతో కేంద్ర బడ్జెట్ తరువాతే ఎప్పటి మాదిరిగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అధికారులు ఆశించిన స్థాయిలో స్పీడ్‌గా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే గతంలో మాదిరిగానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్టు మంత్రులు తెలిపారు. రోజుకు రెండు శాఖల చొప్పున సమీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 871 పథకాలున్నట్టు సిఎం గుర్తించారు. వ్యవసాయ, వైద్య శాఖల్లో ఐదు లక్షల రూపాయల పథకాలు ఉండటం కూడా సిఎంను విస్మయపర్చింది. తెలంగాణలో సెరికల్చర్ లేనే లేదు. కానీ బడ్జెట్‌లో సెరికల్చర్ పథకానికి స్వల్పంగా నిధుల కేటాయింపు జరుగుతోంది. పలు శాఖల్లో అసలు అమల్లోలేని పథకాలకు నిధులు కేటాయిస్తున్నారని, ఇవి కేవలం జీతాలకు సరిపోతున్నాయని తేలింది. వైద్య శాఖలో 80 పథకాలు, ఇరిగేషన్ శాఖలో దాదాపు వంద పథకాలు, వ్యవసాయ శాఖలో 70 నుంచి 80 పథకాలు ఉన్నాయి. ఇలా మొత్తం అన్ని శాఖల్లో 871 పథకాలున్నట్టు తేలింది. దీంతో వీటన్నింటినీ మిళితం చేసి సంఖ్య తగ్గించనున్నట్టు తెలిసింది. ప్రతి ఏటా పలు ప్రభుత్వ శాఖలు నూతన భవనాల నిర్మాణాలకు బడ్టెట్‌లో కేటాయింపులు చేస్తున్నారని, అదేవిధంగా ఈసారీ 2700 భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపారు. ఈ భవనాలు అవసరమేమిటి? ఎందుకు నిర్మిస్తున్నారు అనే దానికి లెక్కాపత్రం ఉండదని, ఇదో తంతుగా మారిందని మంత్రులు అభిప్రాయం వ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటించినప్పుడు ఏదైనా పనికి నిధులు మంజూరు చేయాలంటే ఉపయోగపడే విధంగా తొలిసారిగా బడ్జెట్‌లో ముఖ్యమంత్రికి ఐదువేల కోట్ల నిధిని కేటాయించనున్నట్టు తెలిసింది. జిల్లాల్లో పర్యటించేప్పుడు అప్పటికప్పుడు ఈ నిధి నుంచి మంజూరు చేసేందుకు అవకాశం ఉంటుంది. జిల్లా కలెక్టర్ వద్ద ఐదు కోట్లు, జిల్లా మంత్రి వద్ద 25 కోట్లు ఉంటుందని, మొత్తం ఐదువేల ఐదు వందల కోట్లు ప్రత్యేక నిధి కింద బడ్జెట్‌లో కేటాయించనున్నారు.
అసెంబ్లీలో నిర్ణయం, కేబినెట్ నిర్ణయం అంతా అయిపోయిన తరువాత కూడా ఏ పథకానికైనా ఆర్థిక శాఖ అడ్డుపుల్ల వేస్తే అంతా ఆగిపోతుంది. ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీల అమలుకు సైతం కొన్నిసార్లు తక్షణం అమలు కావడం లేదు. ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌లో సిఎంకు ఐదువేల కోట్ల ప్రత్యేక నిధి కేటాయించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 15శాతం గ్రోత్ రేట్ ఉందని, ఈ ఏడాది మరింతగా పెంచేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎక్సైజ్, రియల్ ఎస్టేట్, వాణిజ్య పన్నులు అన్ని రంగాల్లోనూ మంచి ఆదాయం కనిపిస్తోందని అధికారులు తెలిపారు.
ప్రాజెక్టుల రీ డిజైన్ గురించి ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వివరించాలని సిఎం నిర్ణయించారు. ప్రాజెక్టులను ప్రస్తుతమున్న విధానంలోనే నిర్మించడం ఏమాత్రం ప్రయోజనకరం కాదని, ఇతర రాష్ట్రాలతో వివాదాస్పదమవుతుందని భావిస్తున్న సిఎం, రీ డిజైనింగ్ చేయాలని నిర్ణయించారు. గత సమావేశాల్లోనే వీటిపై విపక్షాలకు వివరించాలని నిర్ణయించినా సాధ్యం కాలేదు. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో వివరించాలని సిఎం నిర్ణయించారు.