తెలంగాణ

ఐఎఎస్, ఐపిఎస్ పోస్టులను భర్తీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: దేశంలో పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్న ఐఎఎస్, ఐపిఎస్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఐఎఎస్ ఖాళీలు 1470, ఐపిఎస్ 906 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కృష్ణయ్య ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కాబట్టి ఈ పోస్టుల భర్తీ కోసం వెంటనే యుపిఎస్‌సి ద్వారా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. వివిధ రాష్ట్రాలలో ఈ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల పాలనా సామర్థ్యం దెబ్బ తింటున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డైరెక్టు రిక్రూట్‌మెంట్ లేకపోవడం వల్ల రాజకీయ నాయకుల అధిపత్యం, అవినీతి, అక్రమాలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. గతంలో తాము ప్రధానికి చేసిన విజ్ఞప్తికి స్పందించిన యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇచ్చిన వివరణలో ఎలాంటి హేతుబద్ధత, శాస్ర్తియత లేదని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఒకే దఫా ఇంత పెద్ద ఎత్తున ఐఎఎస్, ఐపిఎస్ రిక్రూట్ చేస్తే నాణ్యత, సామర్థ్యం తగ్గుతుందని యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చేసిన వాదనలో ఎటువంటి శాస్ర్తియత లేదని ఆయన తెలిపారు.