తెలంగాణ

చేనేతకు పూర్వవైభవం తెస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, సెప్టెంబర్ 26: దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల చీరకు, నేతన్నకు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని టెక్స్‌టైల్ కమిషనర్ కవితగుప్తా, కార్యదర్శి రేష్మివర్మ, డెవలప్‌మెంట్ కమిషనర్ అలోక్‌కుమార్ బృందం తెలిపింది. సోమవారం గద్వాల పట్టణంలోని రాఘవేంద్రకాలనీలో చేనేత కార్మికులతో వారు సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం చేనేత కార్మికుల స్థితిగతులను తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చామని వారు తెలిపారు. ఈ ప్రాంతంలోని చేనేత పరిశ్రమ, కార్మికుల స్థితిగతులు, నేత విధానంపై రాష్ట్రానికి చెందిన జౌళిశాఖ సంచాలకులు ప్రీతీమీనన్, టెస్సో ఎండి శైజలరామయ్యర్, డిప్యూటీ డైరెక్టర్ రాంగోపాల్‌రావు, రామలింగేశ్వరకాంమ్లే, ఆప్కో డైరెక్టర్ వీరన్న కేంద్ర బృందానికి వివరించారు. ఈ సందర్భంగా పట్టణ సమీపంలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చేనేత పార్కు స్థలాన్ని అక్కడ చేయవలసిన అభివృద్ధి పనుల వివరాలను బృందం దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా రంగుల అద్దకం పరిశ్రమ, శిక్షణా కేంద్రం, నేతబజార్ తదితర కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఇందుకు స్పందించిన కేంద్ర బృందం చేనేత పార్కు అభివృద్ధి కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులకు సూచించారు. చేనేత కార్మికులు ఇళ్ల దగ్గరే మగ్గం వేస్తుండడంతో కాళ్లనొప్పులు వస్తున్నాయని, వీటిని రూపుమాపేందుకు తేలికపాటి నేత విధానయంత్రం, ఎయిర్ కంప్రెషర్ నిముడాక్ జాకార్డు సిస్టంను దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అందించేందుకు సిద్ధగా ఉన్నామన్నారు. ఇప్పటికే 1.75 కోట్లతో నూతనంగా క్లస్టర్‌ను మంజూరు చేశామని తెలిపారు. రూ.2.50 కోట్లతో మరో క్లస్టర్ మంజూరు చేయాలని చేనేత కార్మిక సంఘం నేత కాంమ్లే సూచించగా అందుకు కేంద్ర బృందం ఆమోదం తెలిపింది. అదేవిధంగా చేనేత కార్మికులు మృత్యువాతపడితే ప్రమాదభీమా, ఇన్సూరెన్స్ అందడం లేదని, భవన నిర్మాణ కార్మికుల రీతిలో రూ.5 లక్షల ఇన్సూరెన్స్ అందించాలని రామలింగేశ్వర్‌కాంమ్లే అభ్యర్థించారు. పాలసీ ప్రకారం అందిస్తామని గతంలో ఉన్న రూ.60వేల ఇన్సూరెన్స్‌కంటే పెంచి రూ.లక్ష ఇన్సూరెన్స్ అందించేందుకు కృషి చేస్తామన్నారు.
ఇదిలా ఉండగా కేంద్ర బృందచి సభ్యులతో గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ భేటీ అయ్యారు.

చిత్రం.. రాఘవేంద్రకాలనీలో చేనేత మగ్గాన్ని పరిశీలిస్తున్న కేంద్ర బృందం సభ్యులు