తెలంగాణ

సిఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి యత్నించిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఎఐఎస్‌ఎఫ్ నాయకుడు వేణు ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం సిఎం క్యాంపు కార్యాలయం సమీపానికి చేరుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. రోహిత్ మృతికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండారు దత్తాత్రేయను మంత్రివర్గం నుంచి బర్త్ఫ్ చేయడంతో పాటు విసి అప్పారావును సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.