తెలంగాణ

పరిహారం కోసం కౌలు రైతుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివపేట, సెప్టెంబర్ 26: తుపాను సృష్టించిన బీభత్సానికి తాము సాగు చేసిన పత్తి పంట పూర్తిగా నాశనమైందని, ఇందుకుగాను ప్రభుత్వం చెల్లించాల్సిన పరిహారాన్ని తమకే ఇప్పించాలని లేనిపక్షంలో ఆత్మహత్యలు చేసుకుంటామంటూ మెదక్ జిల్లా సదాశివపేట మండలం పొట్టిపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు కౌలు రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. గ్రామ ప్రజలకు సరఫరా చేస్తున్న మంచినీటి ట్యాంకుపైకి ఉదయం 9 గంటలకు కౌలు రైతులు ఎక్కి కూర్చోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలుస్తామని భరోసా కల్పించడంతో మధ్యాహ్నం 12 గంటలకు ట్యాంకు దిగి ఆందోళన విరమించారు. గ్రామానికి చెందిన రమనోళ్ల నాగేశ్వర్ 20 ఎకరాలు, గొల్ల నర్సింలు, హరిజన్ లక్ష్మయ్యలు 10 ఎకరాల చొప్పున, గొల్ల యాదయ్య 30 ఎకరాలు, పురిడిగారి మహీందర్ 8 ఎకరాల చొప్పున భూమిని కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగు చేసారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి పత్తి చేలలో వరద నీరు చేరుకోవడంతో మొక్కలు కాసిన కాయలన్నీ నీళ్లలో కుళ్లి పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. గత యేడాది కరువు ఏర్పడగా అందిన పరిహారాన్ని కౌలు రైతులకు కాకుండా భూమి యజమానులకు చెల్లించారని, దీంతో తాము అప్పుల ఉబిలో కూరుకుపోయామన్నారు. ప్రభుత్వం పరంగా లభించే పరిహారాన్ని తప్పనిసరిగా కౌలు రైతులకే ఇప్పిస్తామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఖచ్చితమైన హామీ ఇవ్వడంతో ట్యాంకు దిగి తమ గోడును వెళ్లబోసుకున్నారు. పత్తి చేతికి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నామని కానీ భారీ వర్షం తమ ఆశలపై నీళ్లు చల్లిందని ఆందోళన చెందారు. సమస్యకు పరిష్కారం చావుకాదని, పరిష్కారం కోసం అనేక మార్గాలు ఉంటాయని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హితవుపలికారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పంటల పరిస్థితి దారుణంగా మారిందని, వానలు తెరిపిస్తే రెండు మూడు రోజుల్లో అధికారులు పూర్తిస్థాయిలో నివేధికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిస్తారని అన్నారు. ఎవరు కూడా మనోధైర్యం కోల్పోవద్దని రైతు పక్షపాతిగా ముద్రవేసుకున్న సిఎం కెసిఆర్ అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ గిరితో పాటు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం.. వాటర్ ట్యాంకు పైకి ఎక్కిన కౌలు రైతులు