తెలంగాణ

తేరుకుంటున్న హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 26: మహానగరాన్ని కుదిపేసిన తర్వాత ఇపుడిపుడే జనజీవనం కొలుకుంటుంది. వర్షాలు తగ్గటం, భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం ప్రకటించిన సెలవులు ముగియటంతో జనజీవనం క్రమంగా గాడిన పడుతోంది. తరచూ భారీవర్షాల కారణంగా శివార్లలోని నిజాంపేట, హకీంపేట, అల్వాల్ ప్రాంతాలు నీట మునగగా, వీటిలో నిజాంపేట, మహేశ్వరినగర్‌లు సోమవారం కూడా నీటిలోనే ఉన్నాయి. బాధితులకు సోమవారం కూడా వివిధ రాజకీయపార్టీలు, స్వచ్చంద సంస్థలు ఆహార పొట్లాలు, పాలు, మంచినీరు వంటివి అందించారు. సోమవారాల్లో పెద్దగా వర్షం కురవకపోవటం వల్లే గ్రేటర్ కొంత మేరకు కోలుకుంటుందని చెప్పవచ్చు. కానీ అక్కడక్కడ కొద్ది క్షణాల పాటు చిరుజల్లులు కురిశాయి. హుస్సేన్‌సాగర్ నుంచి దిగువకు ఔట్‌ఫ్లోను తగ్గించటంతో దిగువ ప్రాంతాల ప్రజలు ఊపరిపీల్చుకున్నారు.
సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచే వాహనాలు రోడ్డెక్కాయి. వాతావరణం పొడిగా మారటంతో రోడ్లన్నీ దుమ్ము రేగిపోతున్నాయి. వాహనదారులకు వర్షం కురిసినా, ఎండ కొట్టినా రోడ్లతో ఇబ్బందులు తప్పలేదు. నిత్యం రద్ధీగా ఉండే ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్టీకాపూల్, రాణిగంజ్, బేగంపేట తదితర ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా గుంతలమయం కావటంతో గంటల తరబడి ట్రాఫిక్ జాం అయ్యింది.
నీట మునిగిన ఉమామహేశ్వర కాలనీ
శివార్లలో జీడిమెట్ల ఫాక్స్ సాగర్ నీటి మట్టం ప్రమాదకర స్థాయి చేరంది. 2000 సంవత్సరంలో కురిసిన భారీ వర్షానికి గండిపడి బీభత్సం సృష్టించిన ఈ చెరువుకు మళ్లీ ప్రమాదం పొంచి ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇప్పటికే అలుగు పోస్తున్న ఈ చెరువు నీటికి ఉమామహేశ్వరినగర్‌కాలనీ మునిగింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ వర్షాభావ పరిస్థితులు సైతం ఉండటంతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. కాలనీలోని సుమారు 640 ఇళ్లలో 300 ఇళ్లు నీట మునగ్గా, ప్రభుత్వం యంత్రాంగం కాలనీలోని నివాసులందర్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తోంది. ఇప్పటికే కొన్ని ఇళ్లు, షెడ్‌లు, ప్రహారీలు పూర్తిగా నిండిపోయాయి. చుట్టు ప్రక్కల వేసుకున్న గుడిసెల్లోకి సైతం వరద నీరు చేరింది.
నీట మునిగిన ఇళ్లల్లోని సామాగ్రి పూర్తిగా తడిసిముద్దయింది. సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం వరద బాదితులను కొంపల్లి గ్రామంలోని కమ్యూనిటీ హాల్‌కు తరలించింది. కాగా, ఫ్యాక్స్ సాగర్ చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే, అధికారులు ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారు.

చిత్రం.. హైదరాబాద్‌లోని ధరణినగర్‌లో రోడ్డుపై నిలిచిన వర్షం నీటిని మోటర్‌తో తొలగిస్తున్న జిహెచ్‌ఎంసి సిబ్బంది