తెలంగాణ

తెలంగాణలో జల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ వ్యాప్తంగా చెరువులు, కుంటలు ప్రాజెక్టులు నిండి పొంగిపొర్లుతుండడంతో ఎక్కడ చూసినా జల జాతర జరుగుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు కురవడం చెరువులు నిండడంతో గంగమ్మతల్లి పూజలు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి పిలుపు ఇచ్చారు. మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ కరీంనగర్‌లో గంగమ్మతల్లి పూజ చేశారు. అదే విధంగా మంత్రులు తమ తమ జిల్లాల్లో పూజలు చేశారు. ప్రాజెక్టులు నిండిపోవడంతో పెద్ద సంఖ్యలో ప్రాజెక్టుల వద్ద సందర్శకుల కోలాహలం కనిపిస్తోంది. తెలంగాణలో దాదాపు 25వేలకు పైగా చెరువులు మత్తడి దునుకుతున్నాయి. తెలంగాణ పల్లెల్లో జల జాతర వాతావరణం కనిపిస్తోంది.
గ్రామంలోని చెరువుల్లో సెల్ఫీలు దిగుతు సందడి చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో సైతం మేమూ మా ఊరి చెరువు అంటూ గ్రామంలోని చెరువులో ఫోటోలు దిగుతున్నారు. శాసన సభ్యులు, గ్రామ స్థాయి నాయకులు గ్రామంలోని చెరువు వద్ద సెల్ఫీ దిగుతున్నారు. తెలంగాణ ఐటి అధికారి దిలీప్ కొణతాల కేవలం తమ సొంత ఊళ్లో నిండిన చెరువు వద్ద ఫోటో దిగేందుకు గ్రామానికి వెళ్లారు. చాలా కాలం తరువాత గ్రామంలోని చెరువు నిండిందని చెప్పారు. టిఆర్‌ఎస్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సుశీలారెడ్డి తమ సిద్దిపేటలోని చెరువు వద్ద ఫోటో దిగారు. సిద్దిపేటకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో చెరువుకు గంగమ్మ తల్లి పూజ చేశారు.
అన్ని గ్రామాల్లోనూ చెరువుల వద్ద పూజలు, గ్రామస్తుల సందర్శనతో పండుగు వాతావరణం కనిపించింది. చాలా కాలం తరువాత షామీర్ పేట చెరువు నిండిపోవడంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కుటుంబ సమేతంగా చెరువులు, ప్రాజెక్టుల వద్దకు పిక్నిక్‌కు వస్తున్నారు. కాలువలు నదులు అయితే కేవలం వర్షాకాలంలోనే నీరు ప్రవహించి వెళ్లిపోతాయని, కానీ చెరువులు, కుంటలు, వాటర్ పాండ్స్ రూపంలో నీరు నిల్వ చేస్తే ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉంటుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. చెరువు గ్రామానికి పట్టుకొమ్మ అని, రైతులు, చేపలు పట్టుకొని జీవించే వారు పాడి పశువుల పెంపకం దార్లు, ఇంకా ఎన్నో రకాల కుల వృత్తుల ప్రజలు చెరువులపై ఆధారపడి జీవిస్తున్నారని అందువల్లనే చెరువు నిండగానే గ్రామంలో పండుగ వాతావరణం కనిపిస్తోందని హరీశ్‌రావు తెలిపారు.
టిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణను శ్రమదానంతో చేపట్టి గ్రామ ప్రజలను కార్యక్రమంలో పాల్గొనేట్టు చేశారు. గ్రామస్తులు, టిఆర్‌ఎస్ శ్రేణులు శ్రమ దానంతో చెరువుల పునరుద్ధరణ చేపట్టారు.

పొంగి ప్రవహిస్తున్న సిద్ధిపేటలోని చెరువును చూస్తున్న తెలంగాణ మంత్రి హరీశ్‌రావు.
సెల్ఫీ తీసుకుంటున్న మంత్రి