రాష్ట్రీయం

‘కమాండ్ కంట్రోల్’ క్రేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: ఒకప్పుడు కంట్రోల్‌రూమ్. ఇప్పుడు అది ఆధునికత, సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్ రూమయింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా వినిపిస్తోన్న మాట ఇది. ప్రభుత్వాధినేత స్వయంగా అక్కడే ఉండి, అన్నీ పర్యవేక్షించడం ద్వారా క్షేత్రస్థాయి అధికారులను పరుగులు పెట్టించి, వారిలో బాధ్యత పెంచే ఆధునిక పరిపాలనా ప్రక్రియ ఇది. తమకు కష్టం వచ్చినప్పుడు పాలకులు ఇల్లు విడిచి ఒకచోట కొలువుదీరి, తమకోసం పనిచేస్తున్నారనే భావన ప్రజల్లో కల్పించే ఈ సరికొత్త పాలనాప్రక్రియపై ఇప్పుడు క్రేజ్ పెరిగింది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన ఈ ప్రయోగం తెలంగాణలోనూ అమలవుతోంది. కృష్ణాపుష్కరాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని పోలీసు విభాగానికి చెందిన కార్యాలయాన్ని కమాండ్ కంట్రోల్‌రూమ్‌గా మార్చేశారు. అన్ని విభాగాలకు చెందిన ముఖ్య అధికారులంతా అక్కడే ఉండి, బాబు డ్రోన్ల సహాయంతో పుష్కర ఏర్పాట్లను అక్కడే ఏర్పాటు చేసిన స్క్రీన్ల ద్వారా చూసి, అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. చివరకు పబ్లిక్ టాయిలెట్ల పనితీరును కూడా సెల్ఫీ ద్వారా తెలుసుకుని, క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేశారు.
రాష్ట్రంలోని పుష్కర ఘాట్లను కమాండ్ కంట్రోల్ రూముకు అనుసంధానం చేసి, ఏర్పాట్లను డ్రోన్ల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పుష్కరాలు జరిగిన 12 రోజులు చంద్రబాబు అక్కడే ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కమాండ్ కంట్రోల్‌రూము, రాత్రికి ఇబ్రహింపట్నంలో పుష్కరహారతికి హాజరయ్యేవారు. ఆ 12 రోజులు క్యాంప్ ఆఫీసుకు వెళ్లకుండా భోజనం కూడా కమాండ్ కంట్రోల్ రూములోనే కానిచ్చారు. ఈ సరికొత్త పరిపాలనా ప్రక్రియకు జాతీయ మీడియా కూడా ప్రాధాన్యం ఇవ్వడంతో దానికి విస్తృత ప్రాచుర్యం లభించింది.
తాజాగా జరిగిన ఏపి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సు సందర్భంగా చంద్రబాబు ఈ విధానాన్ని జిల్లా స్థాయికి విస్తృత పరిచారు. కమాండ్ కంట్రోల్ రూమును జిల్లా స్థాయిలో కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్‌గా మార్చారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఈ విధానాన్ని స్వయంగా పర్యవేక్షించనున్నారు. దీనివల్ల కింది స్థాయి అధికారులలో బాధ్యత పెరుగుతుందన్నది బాబు భావన. విజయవంతమయిన ఈ పరిపాలనా ప్రక్రియను తెలంగాణలోనూ పాటిస్తున్నారు. ఇటీవలి కాలంలో వరసగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా చంద్రబాబు మాదిరిగానే వర్షాలు తీవ్రంగా పడిన రెండురోజులు అక్కడే గడిపారు. గ్రేటర్ కమిషనర్‌తోపాటు, జిల్లాకు సంబంధించిన అన్ని కీలక శాఖల అధికారులతో అక్కడే సమీక్షలు నిర్వహించారు. రెండురోజులు రాత్రివేళ అక్కడే గడిపారు. మారియట్ హోటల్ వద్ద ఉన్న తూముల స్థితిగతులను పరిశీలించి, మళ్లీ కమాండ్ కంట్రోల్ రూముకు వెళ్లిపోయి, అక్కడి నుంచే వర్ష తీవ్రతను పర్యవేక్షించారు.