ఆంధ్రప్రదేశ్‌

ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నామంటే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబరు 28: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం ససేమిరా అంది. హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామన్నారు. విధిలేక ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు సరేనన్నారు. అయితే, ప్రతిపక్ష వైకాపాతోపాటు విపక్షాలన్నీ చంద్రబాబు వైఖరిని తప్పుపడుతూనే, హోదాపై పోరు కొనసాగిస్తున్నాయి. సరైన సమయంలో ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ప్యాకేజీ తీసుకోవలసి వచ్చిందో జనానికి చెప్పడానికి చంద్రబాబు సమయం దొరికినప్పుడల్లా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు తాపత్రయాన్ని పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవడం లేదు. ప్యాకేజీపై ప్రచార బాధ్యతను తలకెత్తుకోడానికి సిద్ధంగా లేవు. ప్రభుత్వమో, పార్టీయో.. ఎవరు ముద్రించారో కానీ ‘ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పూర్వాపరాలు’ శీర్షికతో 12 పేజీల బుక్‌లెట్‌ను తయారు చేసి పార్టీ ఎమ్మెల్యేలకు ఇబ్బడిముబ్బిడిగా పంపించారు. హోదా ఇవ్వడానికి మొండికేసిన కేంద్రం, ప్యాకేజీ కూడా తీసుకోపోతే నష్టపోతామంటూ లెక్కలతో సహా చూపించారు. ఈ పుస్తకాలను ప్రజలకు పంపిణీ చేయాల్సిన బాధ్యతను ఎమ్మెల్యేల అప్పగించింది. ఈ పుస్తకంలోని సారాంశం క్లుప్తంగా..

ప ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ప్లాన్ ఖర్చుల కింద అదనపు నిధులు పొందుతాయి తప్ప, ఈ ప్రత్యేకత నాన్ ప్లాన్ నిధులకు వర్తించవు.
ప ప్రత్యేక హోదా గల రాష్ట్రాలు 1968 నుంచి అస్థిత్వంలో ఉన్నాయి. పన్ను రాయితీలు అమల్లోకి వచ్చింది 2002లోనేనట.
ప ఉత్తర ఈశాన్య రాష్ట్రాల కొండ ప్రాంతాలు, సరిహద్దు రాష్ట్రాలు. వార్తవానికి అక్కడ ఎటువంటి పరిశ్రమలు ఉండేవి కావు. ఉగ్రవాదం, తీవ్రవాదం పెరిగి యువకులకు ఉద్యోగాలు లేకపోవడం వలన అక్కడ ఏదో విధంగా పరిశ్రమల ఏర్పాటుకు చేయూతనివ్వాలన్న ఉద్దేంతో రాయితీ ఇచ్చారు. భద్రతా చర్యల్లోని అంశంగనే దీన్ని 2002లో ఐదు సంవత్సరాల కోసం ఇచ్చారు తప్ప అభివృద్ధి లక్ష్యంగా తీసుకున్న నిర్ణయం కాదు.
ప 14వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభత్వ ఆదాయం నుంచి రాష్ట్రాలకు గతంలో 32 శాతం నిధులు ఇవ్వడానికి బదులు 42 శాతం ఇవ్వడానికి సిఫార్స్ చేసింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలపాటు పొందుతుంది. ఈ రకంగా ఏపికి ఐదు సంవత్సరాల్లో ప్రత్యేక గ్రాంట్ కింద 22,500 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది.
ప ప్రత్యేక హోదాపై కేంద్రం ససేమిరా అన్న తరువాత సెంట్రల్లీ అసిస్టెడ్ స్టేట్ ప్లాన్ (సిఎఎస్‌పి) కింద తమకు రావల్సిన 30 శాతం నిధులను ఇవ్వాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. బడ్జెట్‌లో దీనిపై ఎటువంటి ప్రోవిజన్ లేదని చెప్పి, కేంద్రం దీనిని తిరస్కరించింది. ఈ నిధులను ఏపికి ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగుతాయని కేంద్రం చేపుతోంది. చివరిగా చంద్రబాబు ఒక పరిష్కారాన్ని ప్రతిపాదించారు. సిఎఎస్‌పిలో 30 శాతం నిధుల్ని ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్(ఇఎపి) రూపంలో ఇవ్వమని కోరారు. దీనిని బడ్జెట్‌లో పెట్టాల్సిన పనిలేదని, మిగిలిన రాష్ట్రాలు కూడా అడగవని సిఎం కేంద్రానికి నచ్చ చెప్పారు. అందుకు కేంద్రం అంగీకరించింది.
పదీనివలన ప్రయోజనం ఏంటంటే..రాష్ట్ర ప్రభుత్వం 10 వేల కోట్ల రూపాయలు రుణం తీసుకుంటే కేంద్రం 6000 కోట్లు, రాష్ట్రం 4000 కోట్లు తిరిగి చెల్లించాలి. అదే ప్రత్యేక హోదా కలిగి ఉంటే కేంద్రం 9000 కోట్లు, రాష్ట్ర 1000 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. హోదా రాకపోవడం వలన 300 కోట్లు నష్టపోతున్నాం. కానీ సిబిఎన్-జైట్లీ ఫార్ములా ప్రకారం ఈ 3000 కోట్ల రూపాయలను ఇఎపి రూపంలో రుణం తీసుకున్నట్టుగా చూపి, ఈ రుణాన్ని టేకోవర్ చేయడం ద్వారా ఎపికి చెల్లిస్తారు. దీనివలన 3000 కోట్లు ఇఎపి కింద ఆదా అవుతుంది. సిఎఎస్‌పికి మాత్రం రాష్ట్ర వాటాగా 4000 కోట్లు చెల్లించాలి. ధన రూపేణా ఎటువంటి నష్టం ఉండదు.
ప ఒకవేళ, మనం ప్రత్యేక హోదా కోసం వేళ్లాడినా వాళ్లు ఇవ్వరు. ఈ మధ్యలో ఎన్‌డిఎ ప్రభుత్వ కాలపరిమితి పూర్తపోతే ఎవరిని అడగాలి? వచ్చే ప్రభుత్వం దీన్ని ఇస్తుందన్న హామీ ఉందా? అయినా రావల్సిన నిధులు వస్తున్నప్పుడు, కేవలం పేరుకోసం కయ్యం పెట్టుకోవాలా?
ప మనం మొండికేస్తే పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోతుంది.
ప కేసులకు భయపడి కేంద్రాన్ని చంద్రబాబు నిలదీయడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో ఆయనపై ఎటువంటి కేసులు లేవు. అప్పుడు ఎందుకు హోదా ఇవ్వలేద? పోలవరానికి నిధులు ఎందుకు ఇవ్వలేదు? ఆర్థిక లోటును ఎందుకు భర్తీ చేయలేదు?
ప ప్రతిపక్షాలకు చంద్రబాబు ప్రభుత్వ విజయాలు సాధించడం ఇష్టం లేదు. ఏదో రకంగా చెడగొట్టి, వచ్చే నిధులు కూడా రాకుండా చేయడమే వారి లక్ష్యం. కేంద్రంతో సంబంధాలు చెడగొట్టి, వచ్చే డబ్బు రాకుండా చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. అప్పుడు అభివృద్ధి జరగదు. ప్రజల్లో అసంతృప్తిని పెంచాలన్నది ప్రతిపక్షాల లక్ష్యం.
ఇదీ! ఈ పుస్తక సారాంశం. ఈ పుస్తకాలను ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలకు అప్పగించారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఈ పుస్తకాలను ఆవిష్కరించి, తమ తమ నియోజకవర్గాల్లో పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలు పెట్టడం గమనార్హం. ఈ పుస్తకాలు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచ్చి వచ్చాయని టిడిపి నాయకులు చెపుతున్నారు.