తెలంగాణ

ఉత్తర తెలంగాణకే గుండెకాయ ‘ఎల్లంపల్లి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 28: ఉత్తర తెలంగాణకు ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండెకాయలాంటిదని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టే కాక మరెన్నో ప్రాజెక్టులను రూపకల్పన చేసి ప్రజలకు సాగు, తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ అనాదిగా కృషి చేస్తూనే ఉందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చిందంటే కాంగ్రెస్ ఘనతేనని అన్నారు. శాసనమండలి సిఎల్‌పి నేత మహ్మద్ షబ్బీర్ అలీ, పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సిఎల్‌పి ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీ్ధర్‌బాబు, పిసిసి ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయంతో కలిసి బుధవారం కరీంనగర్ జిల్లాలోని రామగుండం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతీ ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ చేపట్టినవేనన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో చేపట్టింది ఏ ఒక్కటి కూడా లేదని ధ్వజమెత్తారు. రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ఎల్లంపల్లి ప్రాజెక్టుతోపాటు ఏవేవో ప్రాజెక్టులను తానే పూర్తి చేశానని చెప్పుకొని ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 2004లోనే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అంకురార్పణ చేశామని, తాము అధికారం నుంచి దిగేటప్పటికే 86 శాతం పనులు పూర్తి చేశామన్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రతరంలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టును ప్రారంభించాలనుకున్నప్పటికీ జిల్లాకు చెందిన అప్పటి మంత్రి శ్రీ్ధర్ బాబు సమైక్యాంధ్రకు చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా చేసేందుకు అయిష్టత వ్యక్తం చేయడం వల్లే నాడు ప్రారంభించలేక పోయామన్నారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కెసిఆర్ పెండింగ్‌లో ఉన్న పంప్‌హౌజ్‌లను కూడా కనెక్టివిటీ చేయలేకపోయారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు వల్ల 2.20 లక్షల ఆయకట్టు సాగవుతుందన్నారు. 21 టిఎంసిల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో 60 టిఎంసిల సామర్థ్యం ఉండేలా రూపొందించామన్నారు. ఎల్లంపల్లి నుంచి 6.50 టిఎంసిలు ఎన్‌టిపిసికి, 2 టిఎంసిలు మంథని ప్రాంతానికి, 10 టిఎంసిలు హైదరాబాద్‌కు నీటి సరఫరా చేయడం లక్ష్యంగా ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులను తామే చేశామని కెసిఆర్ చెప్పుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో టిఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతారని ఉత్తమ్ అన్నారు. అనంతరం గండిపడిన మిడ్‌మానేరును సందర్శించి ముంపు గ్రామాల్లో పర్యటించారు.
కాంగ్రెస్‌ను తిడితే
హీరోలు కారు: షబ్బీర్ అలీ
తెలంగాణలో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లలోనే తామేదో పొడిచామని, తామే ప్రాజెక్టులు నిర్మించామని, తమ కృషి వల్లే నేడు రైతులకు టిఎంసిల కొద్దీ నీరు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ కెసిఆర్, ఆయన అల్లుడు హరీష్ రావు కళ్లు మూసుకొని మాయమాటలు చెబుతున్నారని శాసనమండలిలో సిఎల్పీ నేత షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మామఅల్లుళ్ళు నోరు తెరిస్తే చాలు కాంగ్రెస్‌ను తిట్టడం అలవాటుగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రెండున్నరేళ్లలో ఏ ఒక్కటైనా పూర్తి చేశారో చూపించాలని ఆయన సవాల్ విసిరారు. ప్రతీ విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. గడిచిన రెండున్నరేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా డిపిఆర్ రూపొందించలేదని విమర్శించారు. దమ్ముంటే మేడిగడ్డ (కాళేశ్వరం), మల్లన్నసాగర్, మహాబూబ్‌నగర్ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్‌లను కేంద్రానికి సమర్పించి బహిర్గతం చేయాలని ఆయన సవాల్ విసిరారు. పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ 2004లో ఆనాడు వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా తాను, శ్రీ్ధర్ బాబు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా కలిసి ఆయన గదిలో అరగంట సేపు కూర్చుని చర్చించి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఓ రూపం తీసుకువచ్చామన్నారు. ఆనాడు ప్రారంభమైన పనులు ఎన్నికల నాటికి పనులు చివరి దశకు చేరుకున్నాయని, ఎన్నికలు రావడంతోనే పూర్తి చేయాలేకపోయామన్నారు. మిగిలిన పనిని కూడా పూర్తి చేయించలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ప్రజలకు దొరికాడన్నారు.