తెలంగాణ

‘దేశంలో సగం మందికి మరుగుదొడ్లు లేవు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: దేశంలో ఇంకా 50శాతం మంది ప్రజలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యు ఆర్ రెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశం అన్ని రంగాల్లోనూ బాగా అభివృద్ధి చెందిందని, పరిశుభ్రత పాటించే విషయంలో చాలా మార్పులు వచ్చాయని, అయినా ఇప్పటికీ 50శాతం మంది ప్రజలకు మరుగుదోడ్లు లేవని అన్నారు. వంద శాతం మరుగుదొడ్లు గల దేశంగా నిలిచినప్పుడే మహాత్మాగాంధీకి నిజమైన నివాళి అని అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా రాజేంద్ర నగర్‌లోని ఎన్‌ఐఆర్‌డిపిఆర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెత్తను విద్యుత్ ఇంధనంగా వాడుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు.