తెలంగాణ

కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ల పైరసీపై పంజా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 1: కంప్యూటర్లలో ఉపయోగిస్తున్న వివిధ రకాల సాఫ్ట్‌వేర్ల పైరసీని నిలువరించడానికి ఆయా కంపెనీల ప్రతినిధులు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తుండటంతో కంప్యూటర్లలో పైరసీ సాఫ్ట్‌వేర్లు ఉపయోగిస్తున్న వా రు హడలెత్తిపోతున్నారు. జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, సిద్దిపేట, మెదక్ తదితర ప్రాంతాల్లో మూడు రోజులుగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమతి లేకుండా డౌన్‌లోడ్ చేసి సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. దీంతో ఇంటర్నెట్ సెంటర్లు, డిటిపి సెంటర్లు, ఆడియో, వీడియో సెంటర్లు ప్రధాన పట్టణాల్లో మూతపడుతున్నాయి. ఐటి హబ్బుకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుండటం తో సాఫ్ట్‌వేర్ల అమ్మకాలను పెంచడానికి ఈ దాడులు దోహదపడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐటి హబ్బు నిలదొక్కుకోవాలంటే పైరసీని నియంత్రించాల్సిన ఆవశ్యకతను గు ర్తించి ఈ దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులో ఎక్కువ శాతం ఉపయోగించే అనుపాంట్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. జహీరాబాద్ పట్టణంలో ముగ్గురు వ్యక్తులపై జరిమానాలు వేయగా సంగారెడ్డిలో మరొ వ్యక్తికి జరిమానా విధించినట్లు సమాచారం. అను సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయాలంటే 12 వేల రూపాయల వర కు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అడో బ్ సంస్థకు చెందిన ఫొటోషాప్‌ను కొనుగోలు చేయడానికి ఎంత మాత్రం అవకాశం లేదు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే వారు నెలకు 500 రూపాయలను అద్దె రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి ఏ కంప్యూటర్ లో చూసినా ఫొటోషాప్ దర్శనమిస్తోంది. విండోస్ సాఫ్ట్‌వేర్‌కు తక్కువకు తక్కువ 15 వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉం టుంది. కోరల్ డ్రా అనేసాఫ్ట్‌వేర్‌ను కూడా పెద్ద మొత్తంలో చెల్లించి కొనుగోలు చేసుకోవాలి. నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా పైరసీ చేసి సాఫ్ట్‌వేర్లను ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఆయా సంస్థల ప్రతినిధులు మూకుమ్మడి దాడులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. వీడి యో ఎడింగ్ సెంటర్లను కూడా బృం దాలు లక్ష్యంగా పెట్టుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల సమాచారం అందుకున్న ఆయా ఇంటర్నెట్, డిటిపి, ఆడియో, వీడియో సెంటర్లను మూసివేసారు. దీంతో వినియోగదారులకు, అత్యవసరంగా డిటిపి చేయించాల్సిన వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉన్న ఫలంగా దుకాణాలు మూతపడటంతో తనిఖీ బృందాల్లో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఉన్న వ్యాపారానికి ఎసరు వచ్చే ప్రమాదాన్ని గమనించిన కొంత మంది ఇంటర్నెట్ సెం టర్ల యజమానులు అసలు సాఫ్ట్ వేర్ లను కొనుగోలు చేసేందుకు సిద్దమవుతున్నారు. సాఫ్ట్‌వేర్లతో పాటు సినిమా పైరసీలపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సా ఫ్ట్‌వేర్ల పైరసీపై ముమ్మరంగా దాడులు నిర్వహిస్తుండటంతో అసలు సాఫ్ట్‌వేర్లకు గిరాకి పెరిగిందని చెప్పవచ్చు.