తెలంగాణ

ఒవైసీ సోదరులపై కేసులు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ నేతలపై దాడికి పాల్పడ్డారనే అభియోగాలపై మజ్లిస్ అధినేత లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీలపై కేసు నమోదైంది. మీర్‌చౌక్ పోలీసులు అదుపులోకి తీసుకున్న పురానాపూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ గౌస్‌ను పరామర్శించేందుకు వచ్చిన టి.పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీనియర్ నాయకుడు మహమ్మద్ షబ్బీర్ అలీలపై తన అనుచరులతో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దాడికి పాల్పడ్డారనే అభియోగంపై ఐపిసి సెక్షన్ 143, 323, 341, 427, 506 ఆర్/ డబ్ల్యు 149 కింద కేసు నమోదు చేసినట్టు మీర్‌చౌక్ పోలీసులు తెలిపారు. అదేవిధంగా జంగమ్మెట్ పోలింగ్ బూత్‌లోని బిజెపి ఏజెంట్ మహేందర్‌పై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేయి చేసుకున్నారన్న అభియోగంపై ఐపిసి సెక్షన్ 143, 147, 123, ఆర్‌డబ్ల్యు 149 కింద చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. డిప్యూటీ సిఎం మహమూద్ అలీ ఇంటిని ముట్టడించి, ఆయన కుమారుడు ఆజం అలీపై చేయిచేసుకున్న మలక్‌పేట ఎమ్మెల్యే బలాలను ఐపిసి సెక్షన్ 341, 448, 427, 506, 147 కింద అరెస్ట్ చేసి బుధవారం నాంపల్లి కోర్టుకు హాజరుపర్చారు. కాగా ఎమ్మెల్యే బలాలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా పురానాపూల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మహమ్మద్ గౌస్, చార్మినార్ ఎమ్మెల్యే పాషాఖాద్రిల పరస్పర దాడుల నేపథ్యంలో చార్మినార్ పోలీసులు ఇరువురిపై ఐపిసి 141 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే పాషాఖాద్రి, మహమ్మద్ గౌస్, ఎమ్మెల్యే బలాలను పోలీసులు అదుపులోకి తీసుకోగా మజ్లిస్ నాయకులు అక్బరుద్దీన్ ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసీలను అరెస్టు చేయలేదు. కాగా ఎంబిటి అభ్యర్థిపై దాడికి పాల్పడిన నలుగురిని చార్మినార్ పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలావుండగా కాంగ్రెస్ నాయకులపై దాడికి పాల్పడిన ముగ్గురు యువకులు మోహియుద్దీన్, హబీబ్, మహమ్మద్ కశ్యప్ పోలీసులకు లొంగిపోయారు. కాగా వీరిని అరెస్టు చేసినట్టు దక్షిణ మండలం డిసిపి వి సత్యనారాయణ తెలిపారు.

చిత్రం... ఎమ్మెల్యే బలాలను నాంపల్లి కోర్టులో
హాజరుపర్చేందుకు తీసుకెళ్తున్న పోలీసులు