తెలంగాణ

షాద్‌నగర్ ట్రాన్స్‌కో కార్యాలయంలో మందు... విందు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, అక్టోబర్ 7: ప్రభుత్వ కార్యాలయాలను దేవాలయాలుగా భావించాల్సిన అధికారులే అక్కడే చిత్తుగా మద్యం సేవించి మత్తులో మునిగి తేలారు. శుక్రవారం మధ్యాహ్నం షాద్‌నగర్ ట్రాన్స్‌కో కార్యాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కాంట్రాక్టర్‌ను పక్కన కుర్చోబెట్టుకొని ముగ్గురు ట్రాన్స్‌కో ఏఇలు కార్యాలయ పనివేళ్లల్లో చిత్తుగా మద్యం సేవించారు. ట్రాన్స్‌కో కాంట్రాక్టర్‌తో కలిసి షాద్‌నగర్ టౌన్ ఎఇ, రూరల్ ఎఇ, కేశంపేట ఎఇలు కలిసి ఏకంగా మద్యం చిత్తుగా సేవించి మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో ట్రాన్స్‌కో అధికారులు ముఖం చాటేసుకొని అక్కడి నుండి వెళ్లిపోయారు. ట్రాన్స్‌కో కార్యాలయం అవరణలోనే అధికారులు మద్యం మత్తులో ఊగిసలాడటంతో అక్కడికి వచ్చిన వారు విస్తుపోయారు. మద్యం సేవిస్తున్న విషయాన్ని తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కార్యాలయానికి చేరుకొని దృశ్యాలను చిత్రీకరిస్తుండటంతో సదరు అధికారులు అక్కడి నుండి జారుకున్నారు. మద్యం సేవిస్తూ మాంసం ముక్కలు తింటూ అధికారులు అడ్డంగా మీడియాకు దొరికిపోవడం సంచలనం సృష్టించింది. అధికారుల తీరుపై పెద్దఎత్తున చర్చించుకుంటున్నారు. కార్యాలయానికి వచ్చే గ్రామీణ ప్రాంత రైతుల సమస్యలను పట్టించుకోకుండా అధికారులు మద్యం సేవించడం ఎంతవరకు సమంజసమని ప్రజలు విమర్శిస్తున్నారు.
విచారణ జరుపుతాం
ట్రాన్స్‌కో ఎడి నవీన్‌కుమార్
ప్రభుత్వ కార్యాలయంలో ఎఇలు, కాంట్రాక్టర్లు మద్యం సేవించిన విషయంపై విచారణ చేపడుతామని షాద్‌నగర్ ట్రాన్స్‌కో ఎడి ఎం.నవీన్‌కుమార్ తెలిపారు. పెండింగ్ బిల్లుల విషయమై తాను శుక్రవారం మధ్యాహ్నం కొత్తూరుకు వెళ్లినట్లు తెలిపారు. తాను కొత్తూరుకు వెళ్లిన తరువాత ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నట్లు వివరించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉన్న వాస్తవాలను పై అధికారులకు నివేదించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ట్రాన్స్‌కో ఎడి నవీన్‌కుమార్ తెలిపారు.

చిత్రం.. షాద్‌నగర్ ట్రాన్స్‌కో కార్యాలయంలో శుక్రవారం మద్యం సేవిస్తూ
విందు చేసుకుంటున్న అధికారులు, కాంట్రాక్టర్