తెలంగాణ

అంతర్జాతీయ వేదికపై తెలంగాణ స్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ఓపెన్ డాటా కాన్ఫరెన్స్‌లో తెలంగాణ స్వరం వినిపించే మహత్తరమైన అవకాశం లభించింది. తెలంగాణ రాష్ట్ర డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతంను కాన్ఫరెన్స్ నిర్వాహకులు ఆహ్వానించారు.
దేశంలో తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఈ గౌరవం లభించడం గమనార్హం. ఇలాఉండగా కాన్ఫరెన్స్‌లో దిలీప్ కొణతం ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యాన్ని వివరించారు. ఆరు దశాబ్దాల పాటు శాంతియుతంగా తెలంగాణ ఉద్యమం జరిగిన క్రమాన్ని ఆయన వివరించినప్పుడు సభికులు హర్షధ్వానాలు చేశారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ వివిధ రంగాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. ఓపెన్ డాటా పాలసీని రూపొందించడంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నేషనల్ డాటా షేరింగ్ అండ్ యాక్సబిలిటీ పాలసీ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, ఈ రంగంలో అనేక మంది సలహాలు, సూచనలు పొందామని, అనంతరం సమగ్రంగా ఓపెన్ డాటా పాలసీని రూపొందించినట్లు దిలీప్ కొణతం తెలిపారు.

చిత్రం.. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరుగుతున్న
అంతర్జాతీయ ఓపెన్ డాటా కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తున్న రాష్ట్ర డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం