తెలంగాణ

పోలీస్ మేళా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర పోలీసు శాఖలో 510 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. అలాగే కమ్యూనిషన్ల శాఖలో ఎస్సై క్యాడర్ 23 పోస్టులు, పోలీసు రవాణా శాఖలో 6 ఎస్సై క్యాడర్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ జారీ చేశారు. కొద్దిరోజుల క్రితమే పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు 9281 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. సివిల్ ఎస్సై ఖాళీలు 208, ఆర్మ్‌డ్ రిజర్వు ఎస్సై ఖాళీలు 74, అంబర్‌పేట పోలీసు లైన్స్ విభాగంలో రిజర్వు ఎస్సై ఖాళీలు 2, తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగంలో రిజర్వు ఎస్సై ఖాళీలు 205, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 12, అగ్నిమాపక శాఖలో ఫైర్ ఆఫీసర్ ఖాళీలు 9 భర్తీ చేయాలని తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయించింది. దీంతోపాటు పోలీసు కమ్యూనికేషన్స్ శాఖలో ఎస్సై ఖాళీలు 23, పోలీసు రవాణా సంస్థలో ఆరు ఖాళీలు భర్తీ చేస్తారు. ఎస్సై పోస్టులకు ప్రాథమిక రాత పరీక్షను వచ్చే ఏప్రిల్ 17న నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఈనెల 10నుంచి స్వీకరిస్తారు. దరఖాస్తులను పంపేందుకు చివరి తేదీ మార్చి 3గా నిర్ణయించారు. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కనీస వయోపరిమితి 21 సంవత్సరాలు. ప్రిలిమినరీ రాత పరీక్షను రెండువందల మార్కులకు నిర్వహిస్తారు. అబ్జెక్టివ్ టైప్‌లో ప్రశ్నాపత్రం ఉంటుంది. అర్థమ్యాటిక్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీలో వంద ప్రశ్నలు, జనరల్ స్టడీస్‌లో వంద ప్రశ్నలు ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సంపాదించిన అభ్యర్ధులకు దేహ దారుఢ్య పరీక్ష నిర్వహిస్తారు. దేహదారుఢ్య పరీక్షలో అర్హులైన వారికి తుది రాత పరీక్ష నిర్వహిస్తారు. నాలుగు పేపర్లు ఉంటాయి. సివిల్ ఎస్సై, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఐదు వందలకు, మిగిలిన కేటగిరీ ఉద్యోగాలకు నాలుగు వందల మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ఇందులో పేపర్ 1లో అర్ధమ్యాటిక్స్, మెంటల్ ఎబిలిటీలో రెండు వందల మార్కులు, పేపర్ 2లో జనరల్ స్టడీస్ రెండు వందల మార్కులు, పేపర్ 3లో ఇంగ్లీషు డిస్ట్రిప్టివ్ టైప్ వంద మార్కులు, పేపర్ 4లో తెలుగు లేదా ఉర్దూ డిస్ట్రిప్టివ్ టైప్‌లో ప్రశ్నాపత్రం ఉంటుంది. ఇందులో మొదటి రెండు పేపర్ల ప్రశ్నలు అబ్జెక్టివ్ టైప్‌లో ఉంటాయి.
కాగా కమ్యూనికేషన్స్ విభాగంలో ఎస్సై పోస్టులకు బిటెక్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఐటి లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా డిప్లమో ఉత్తీర్ణులై ఉండాలి. పోలీసు రవాణా శాఖలో ఎస్సై ఉద్యోగాలకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాలకు తీతీతీ.ఆఒఔఇ.జశను సంప్రదించాలని రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ పేర్కొన్నారు.