తెలంగాణ

డెడ్ స్టోరేజీకి ఎస్సారెస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా భాసిల్లుతున్న శ్రీరాంసాగర్ జలాశయంలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో అటు ఆయకట్టు రైతులు, ఇటు ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోం ది. ఇప్పటికే నీటి నిల్వలు అడుగంటిన నేపథ్యంలో గత ఖరీఫ్ సీజన్‌లోనూ ఎస్సారెస్పీ ద్వారా పంటలకు సాగు జలాలు అందించలేకపోయా రు. ప్రస్తుత రబీ సీజన్‌లోనైతే బో రుబావులు కలిగి ఉన్న రైతులు మినహా, వేలాది ఎకరాల విస్తీర్ణంలో ఇతర రైతులు పంటలను సాగు చేయకుం డా తమ భూములను పడావుగా వదిలేశారు. పంటల పరిస్థితి ఇలా ఉంటే, కనీసం తాగునీటి అవసరాలను సైతం తీర్చలేని దైన్య స్థితికి శ్రీరాంసాగర్ రిజర్వాయర్ చేరుకోవడం ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. 1091 అడుగులు, 90టిఎంసిల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 6టిఎంసిల నీటి నిల్వలు మాత్రమే మిగిలాయి. ఇందు లో 5టిఎంసిలను డెడ్ స్టోరేజీగా పరిగణిస్తారు. మిగతా ఒక టిఎంసి నీటిని ఎస్సారెస్పీ పరిసర గ్రామాలకు తాగునీరుగా అందించినా, అవి కేవలం రెండు నెలల వ్యవధికే సరిపడే పరిస్థితి కనిపిస్తోంది. అంటే మార్చి నెలాఖరు వరకే ఈ నిల్వలు కూడా అతికష్టం మీద అందించవచ్చని చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే ఎండలు పెరుగుతున్న క్రమంలో ఎస్సారెస్పీలో నిల్వ ఉన్న నీరు కూడా చాలావరకు ఆవిరి రూపంలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో అందుబాటులో ఉన్న ఒక టిఎంసి నీటిలోనూ దాదాపు 0.30టిఎంసిల వరకు ఆవిరి రూపం లో నష్టపోతే మిగతా 0.70టి ఎంసిల నీరు మాత్రమే తాగునీటి అవసరాలకు పనికి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రతిఏటా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాలలోని ఖరీఫ్‌లో 9లక్షలు, రబీలో సుమారు ఆరు లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీటిని అందించాల్సిన శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌లో పూర్తిగా నీటి నిల్వలు అడుగంటిపోయి ఇంతటి గడ్డు పరిస్థితులు ఉత్పన్నం కావడం పుష్కర కాలంలో ఇదే మొదటిసారి అని స్థానికులు, ఆయకట్టు రైతులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. గతేడాది ఇదే సమయానికి శ్రీరాంసాగర్‌లో 34టిఎంసిల పైచిలుకు నీటి నిల్వలు మిగిలి ఉన్నాయి. అందుకు భిన్నంగా ఈ ఏడాది డెడ్ స్టోరేజీకి చేరువైంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెంటాడడం, ఎగువ ప్రాంతం నుండి వరద జలాలు వచ్చి చేరకపోవడంతో శ్రీరాంసాగర్ జలాశయం నీటి నిల్వలను సంతరించుకోలేక ఎడారిలా మారిందని చెప్పవచ్చు. ఎస్సారెస్పీ బోసిపోవడంతో దాని నీటి నిల్వ ప్రాంతాల్లో రైతులు గత ఖరీఫ్ సీజన్‌తో పాటు ప్రస్తుత రబీ సీజన్‌లోనూ ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారంటే పరిస్థితిని ఊ హించుకోవచ్చు. అయితే ఆయకట్టు రైతులు మాత్రం రిజర్వాయర్‌లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోవడంతో ఆరుతడి పంటలు వేసేందుకు కూడా ముందుకురాని దైన్య స్థితి నెలకొని ఉంది. ఎస్సారెస్పీ ద్వారా లబ్ధి చేకూరే కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలలో ఎస్సారెస్పీ వట్టిపోయిన ప్రభా వం రబీ పంటలపై స్పష్టంగా కనిపిస్తోంది.
chitram...
డెడ్‌స్టోరేజీకి చేరువైన ఎస్సారెస్పీ నీటి మట్టం