తెలంగాణ

కెసిఆర్‌కు రాజకీయ వారసుడు కెటిఆరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాజకీయ వారసుడు కె తారక రామారావే అని నిజామాబాద్ ఎంపి కవిత వ్యాఖ్యానించారు. కెసిఆర్ రాజకీయ వారసుడు కెటిఆర్ అని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తమ తీర్పు ద్వారా తేల్చి చెప్పారని అన్నారు. మీడియాతో శనివారం కవిత ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
గ్రేటర్ ఎన్నికల ప్రచార బాధ్యత చేపట్టిన కెటిఆర్‌ను ప్రజలు కెసిఆర్ రాజకీయ వారసునిగా స్వీకరించారని అన్నారు. కెసిఆర్ కుమార్తె కవిత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా నగరంలో విస్తృతంగా ప్రచా రం నిర్వహించారు. కెసిఆర్ వారసునిగా కెటిఆర్‌కు ప్రజల ఆమోదం లభించిందని అన్నారు.
హమాలీ బస్తీలో పర్యటన
గ్రేటర్ ఎన్నికల బహిరంగ సభలోనే కెటిఆర్‌కు మున్సిపల్ వ్యవహారాల శాఖ అప్పగించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగే క్యాబినెట్ సమావేశంలో కెటిఆర్‌కు మున్సిపల్ వ్యవహారాల శాఖ అప్పగించనున్నారు. తొలుత హైదరాబాద్‌లో, ఆ తరువాత వివిధ మున్సిపాలిటీల్లో కెటిఆర్ విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించారు. గ్రేటర్ విజయంతో ఉత్సాహంగా ఉన్న పార్టీ నాయకత్వం కెటిఆర్ ఇప్పుడే రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించాలని భావిస్తోంది. 99 డివిజన్లలో విజయం సాధించడంతో నగరంలో పార్టీ పటిష్టతపై దృష్టిసారించింది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి విపక్షాలు ఇంకా తేరుకోక ముందే ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు రంగంలో దిగారు. సికిందరాబాద్ సమీపంలోని పద్మారావు నగర్ హమాలీ బస్తీలో పర్యటించారు. బస్తీ వాసులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సంవత్సరం హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. హమాలీ బస్తీలోని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే
సదాశివరెడ్డి మృతి

సంగారెడ్డి, ఫిబ్రవరి 6: గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె.సదాశివరెడ్డి (84) శనివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. పటన్‌చెరు పట్టణానికి చెందిన సదాశివరెడ్డి 1934లో రాంరెడ్డి, అనంతమ్మ దంపతులకు జన్మించారు. పదకొండు సంవత్సరాల పాటు సర్పంచ్‌గా, నాలుగేళ్లు సమితి ప్రెసిడెంట్‌గా, మూడేళ్లు డిసిసిబి చైర్మన్‌గా పదవులు చేపట్టిన సదాశివరెడ్డి 1985లో మొదటి సారిగా సంగారెడ్డి అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓట మి పాలయ్యారు. ఎన్టీఆర్ ప్రభంజనంతో 1994లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన సదాశివరెడ్డి కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడిగా పేరుగాంచిన మాజీ స్పీకర్ పి.రాంచంద్రారెడ్డిపై భారీ మెజార్టీతో గెలుపొంది రాష్ట్రంలో రెండవ మెజార్టీ సాధించారు. ఎమ్మెల్యే పదవితో పాటు ఎపిఐడిసి, ఎపి ఐఐసి సంస్థలకు డైరెక్టర్‌గా, హుడా మెంబర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గం బిజెపికి కేటాయించడంతో సదాశివరెడ్డి పోటీచేసే అవకాశం కోల్పోయారు. 2004లో టిఆర్‌ఎస్ పార్టీలో చేరి టికెట్ ఆశించినా నిరాశ ఎదురైంది. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఐదు సంవత్సరాల పాటు మచ్చలేని ఎమ్మెల్యేగా పని చేసిన సదాశివరెడ్డి మృతికి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేసారు.
వ్యాపారులపై రైతుల దాడి
తప్పుడు తూకం వేశారని ఆగ్రహం
చిన్నకోడూరు, ఫిబ్రవరి 6: పత్తి తూకంలో మోసం చేస్తున్నారని వ్యాపారులను రైతు లు చితకబాది పోలీసులకు అప్పగించిన సంఘటన శనివారం మెదక్ జిల్లా చిన్నకోడూరులో జరిగింది. చిన్నకోడూరు ఎస్‌ఐ సత్యనారాయణ కథనం ప్రకారం... గ్రామానికి చెం దిన రెడ్డి సుధాకర్‌రెడ్డి తనకున్న 2ఎకరాల పొలంలో పత్తి పండించాడు. శనివారం ఏపిలోని కడప జిల్లా పొద్దుటూరు, మైదుకూరుకు చెందిన వ్యాపారులు మురళీమోహన్‌రెడ్డి, కళ్యాణ్, సురేందర్, నాగేశ్వర్, రాంరెడ్డిలు పత్తి కొనుగోలు చేసేందుకు క్వింటాల్‌కు రూ.4330 చొప్పున సుధాకర్‌రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎలక్ట్రానిక్ కాంటా మీద తూకం వేస్తుండగా పక్కనే ఉన్న వ్యాపారి మురళీమోహన్‌రెడ్డి రిమోట్‌తో క్వింటల్‌కు 20కిలోల పత్తిని తగ్గిస్తున్నాడు. ఇది గమనించిన రైతు నిలదీయడంతో వ్యాపారుల బండారం బయటపడింది. దీంతో రైతులు వ్యాపారులను చితకబాది స్తంభానికి నిర్బంధించారు. విచారించగా క్వింటాల్‌కు 20కిలోల పత్తి తగ్గిస్తున్నట్లు వ్యాపారులు ఒప్పుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.