తెలంగాణ

హరితహారం తీరును పరిశీలించిన మధ్యప్రదేశ్ అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 15: మధ్యప్రదేశ్‌కు చెందిన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ అధికారి గౌతమి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి విజయలక్ష్మి సిద్దిపేట నియోజకవర్గంలో చేపట్టిన హరితహారం అమలు తీరును శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిద్దిపేట మండలం మిట్టపల్లి గురుకుల పాఠశాల, ఇబ్రహీంపూర్, నాంచారుపల్లి, కోదండరావుపల్లి గ్రామాల్లో బృందం పర్యటించి నాటిన మొక్కలను పరిశీలించారు. ప్రయోగాత్మకంగా మధ్యప్రదేశ్‌లో ఈ కార్యక్రమం చేపట్టేందుకు రాష్ట్ర అధికార బృందం పరిశీలించారు. చేస్తున్న పనులను చూసి బృందం సంతృప్తి వ్యక్తం చేసి బాగా అమలు కావడం పట్ల అభినందించారు. వీరివెంట ఎంపిడిఓ సమ్మిరెడ్డి, ఏపిఓ నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.
హరితహారం అమలు తీరును
పరిశీస్తున్న మధ్యప్రదేశ్ అధికారులు

చక్కెర పరిశ్రమలో అగ్నిప్రమాదం

రెండున్నర కోట్లు ఆస్తి నష్టం
కొత్తకోట,అక్టోబర్15: వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని శ్రీకృష్ణవేణి చక్కెర పరిశ్రమలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిఎం నాగేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. పరిశ్రమల్లోని విద్యుత్ ఉత్పాదన కోసం బొగ్గును చెరకును తరలించే రబ్బర్ బెల్టు రాపిడి వల్ల 4 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మంటలు ఎగిసిపడడంతో వెంటనే వనపర్తి ఫైర్‌స్టేషన్‌కు సిబ్బంది సమాచారం అందించారు. పరిశ్రమలో ఉన్న ఫైరింజన్లు, వనపర్తి ఫైర్ ఇంజన్ సహకారం తో అక్కడ ఉన్న యంత్రాలను మంటలను అదుపు చేశాయి. దీంతో సుమారుగా రెండున్నర కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు జిఎం నాగేశ్వర్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, సిబ్బంది అప్రమత్తం కావడంతో ఎక్కువ మోతాదులో ఆస్తినష్టం వాటిల్లకుండా కాపాడుకున్నట్లు ఆయన తెలిపారు.