తెలంగాణ

ఫార్మా కంపెనీలో పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖల్ పారిశ్రామికవాడలోని హసిత కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఘటనలో ముగ్గురు కార్మికులు సజీవ దహనమయ్యారు. ముగ్గురి మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా కాలిపోయాయి. తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫ్యాక్టరీలో కెమికల్ బ్యాగులు అప్‌లోడ్ చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సత్యనారాయణ మూర్తి (45) వెంకటేశ్వర్‌రావు (28), చత్తీస్‌గఢ్‌కు చెందిన పోపారం (31), దేవారాం (25), దాసురాం (28), జోగారాం (32)లు మృతి చెందిన వారిలో ఉన్నారు. కాగా పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కార్మికుడు సునీల్ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్టు తెలిసింది. ఒకేసారి ఆరుగురు కార్మికులు మృతి చెందడంతో పారిశ్రామికవాడలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడుపై దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్, ఎల్‌బినగర్ డిసిసి ఇక్బాల్, ఆర్డీఓ సుధాకర్, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, కార్మిక సంఘాలు బాధిత కుటుంబాలను పరామర్శించాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ స్థానికులతో కలసి ఫ్యాక్టరీ ముందు ధర్నా, రాస్తారోకో చేపట్టాయి. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు మృతదేహాలను తరలించేది లేదని రోడ్డుపై బైఠాయించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంతోనే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపించారు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు యాజమాన్యంతో చర్చలు జరిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల పరిహారం చెల్లించేందుకు అంగీకరించడంతో ఆందోళన సద్దుమణిగింది.

చిత్రం.. రసాయన కర్మాగారంలో పేలుడు సంభవించిన ప్రాంతం