తెలంగాణ

కొత్త జిల్లాలకు పార్టీ అధ్యక్షులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు పార్టీ కార్యవర్గాలను నియమించుకోవడంలో ఏ మాత్రం జాప్యం చేయకుండా, వెనుకబడకుండా వెంటనే డిసిసి అధ్యక్షులను నియమించాలని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) నిర్ణయించింది. బుధవారం చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన యాత్ర సభ ముగిసిన తర్వాత టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎఐసిసి నాయకుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ కూడా పాల్గొన్నారు. సుదీర్ఘంగా జరిగిన కార్యవర్గ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు కావడం, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సమగ్రంగా చర్చించారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు వెంటనే పార్టీ కార్యవర్గాలను ప్రకటించాలని నిర్ణయించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 30 మంది పేర్లను ఎఐసిసికి పంపించాలని నిర్ణయించారు. జిల్లాల్లో పార్టీకి ఉన్న ఆస్తులపైనా చర్చ జరిగింది. పోచారంను బర్తరఫ్ చేయాలి సమావేశానంతరం టి.పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ నకిలీ, కల్తీ విత్తనాలను అరికట్టడంలో విఫలమైన మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని తీర్మానం చేసినట్లు చెప్పారు.

కొత్త జిల్లాల అధ్యక్షులను
ఎలా ఎన్నుకుందాం
బిజెపి రాష్ట్ర కార్యవర్గంలో చర్చ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 19: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ఎన్నుకునే విషయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. పదాదికారుల సమావేశానికి పార్టీ జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌జీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాలకు అధ్యక్షులను, కార్యవర్గాలను నియమించే అంశం చర్చకు రాగా, పార్టీ రాష్ట్ర నాయకత్వమే నియమించాలని కొంత మంది అభిప్రాయపడ్డారు. అందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కల్పించుకుని కింది స్థాయి నుంచే ఏకాభిప్రాయంతో ఒక పేరు వస్తే బాగుంటుందని అన్నారు. మండల, జిల్లా స్థాయి నాయకులు కూర్చుని ఏకాభిప్రాయంతో పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఒక పేరు పంపించాలని సూచిద్దామని చెప్పారు. ఇంతలో బిజెపి మాజీ ఎంపి జంగారెడ్డి జోక్యం చేసుకుని ఓటింగ్ నిర్వహిద్దామని చెప్పడంతో మిగతా వారు అభ్యంతరం తెలిపారు. లక్ష్మణ్ మాట్లాడుతూ అన్ని సామాజికవర్గాలకు న్యాయం జరిగేలా చూద్దామని అన్నారు.