తెలంగాణ

ప్రభుత్వం మెడలు వంచుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: ‘ప్రభుత్వం మెడలు వంచుతాం... ఫీజు రీయంబర్స్‌మెంట్ వసూలు చేసి, విద్యార్థులకు న్యాయం చేస్తాం..’ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు హెచ్చరించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై కాంగ్రెస్ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పోరాట బాట పట్టింది. శంషాబాద్‌లో ఎన్‌ఎస్‌యుఐ, యువజన కాంగ్రెస్ అధ్వర్యంలో విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఎఐసిసి కార్యదర్శి ఆర్‌సి కుంతియా, ఎఐసిసి ఎస్‌సి విభాగం అధ్యక్షుడు కొప్పుల రాజు, టి.పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో, కళాశాలల్లో పార్టీ నాయకులు ప్రారంభించారు. టి.పిసిసి నాయకుడు పట్లోళ్ళ కార్తీక్‌రెడ్డి నాయకత్వంలో శంషాబాద్ సభకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయాల్సిందిగా విద్యార్థుల నుంచి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పేరిట దరఖాస్తులు లేఖలు తీసుకున్నారు. నెల రోజుల పాటు అన్ని కళాశాలల విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకుని డిసెంబర్ 2న నిర్వహించబోయే బహిరంగ సభలో రాహుల్ గాంధీకి ఆ దరఖాస్తులను అందజేస్తారు. రాహుల్ వాటిని రాష్టప్రతికి అందజేస్తారు.
ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మెడలు వంచి ఫీజు రీయంబర్స్‌మెంట్ తీసుకుని వచ్చి విద్యార్థులకు అందజేస్తామని చెప్పారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం వల్ల 14 లక్షల మంది విద్యార్థులు, రెండున్నర లక్షల మంది అధ్యాపకులు, సిబ్బంది నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నెలా ఫీజు రీయంబర్స్‌మెంట్ చేస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని విమర్శించారు. విద్యార్థుల నుంచి స్వీకరించే దరఖాస్తులను గవర్నర్‌కు, సిఎంకు అందజేస్తామని అన్నారు. అదేవిధంగా డిసెంబర్ 2న నిర్వహించబోయే బహిరంగ సభలో రాహుల్‌కు అప్పగిస్తామని, రాహుల్ వాటిని రాష్టప్రతికి ఇస్తారని ఆయన చెప్పారు.

విద్యార్థుల పోరాటానికి
ఎఐసిసి మద్దతు
సోనియా ఆందోళన చెందుతున్నారన్న కుంతియా
తెలంగాణలో విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై సోనియా గాంధీ ఆందోళన చెందుతున్నారని ఆర్‌సి కుంతియా చెప్పారు. విద్యార్థుల పోరాటానికి మద్దతు ప్రకటించేందుకే వచ్చానని ఆయన తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాన్ని రెండింతలు చేస్తున్నారు తప్ప విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ 3200 కోట్ల రూపాయలు చెల్లించడం లేదని ఆయన విమర్శించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం నిధులు విడుదల చేసేంత వరకూ పోరాడుతామని ఆయన చెప్పారు. కొప్పుల రాజు ప్రసంగిస్తూ దేశంలో మొదటిసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను ప్రారంభించారని అన్నారు. విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయని ఆయన తెలిపారు. మాజీ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ప్రసంగిస్తూ ఫీజు రీయంబర్స్‌మెంట్ వచ్చేంత వరకూ పోరాటం ఆగదని అన్నారు. ఇంకా ఎమ్మెల్యే డికె అరుణ, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు వెంకట్ తదితరులు ప్రసంగించారు. ఇంకా ఎమ్మెల్యేలు సంపత్, వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.