తెలంగాణ

భారత జైళ్ల స్ఫూర్తిని బంగ్లాలో ఆవిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, అక్టోబర్ 21: పొరుగున ఉన్న భారతదేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఉన్న జైళ్ల పనితీరు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, అదే స్ఫూర్తిని తమ దేశంలోని జైళ్లలో ఆవిష్కరిస్తామని బంగ్లాదేశ్‌కు చెందిన జైళ్ల శాఖ అదనపు ఐజి కల్నల్ ఇక్బాల్, రక్షణ శాఖ డిప్యూటీ సెక్రటరీ షేక్ షకీల్ అహ్మద్‌లు పేర్కొన్నారు. 14 మంది సభ్యులతో ఉన్న ఈ బృందం తెలంగాణలోని చర్లపల్లి, తమిళనాడులోని వేలూరు జైళ్లను సందర్శించారు. హైదరాబాద్‌లోని సీకా, తమిళనాడులోని ఆప్కాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న జైళ్ల పనితీరు బాగుందని సంతృప్తిని వ్యక్తం చేసారు. ఈ విధానాలను తమ దేశంలోని జైళ్లలో కూడా తీసుకురావాలనే ఉద్దేశంతోనే బంగ్లా ప్రభుత్వం తమ బృందాన్ని పంపించిందన్నారు. జైళ్లలో చేపట్టిన సంస్కరణలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ఖైదీల పట్ల అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు అభినందించదగిందన్నారు. 200 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని పురాతన జైలు భవనాన్ని మ్యూజియంగా మార్చి ప్రజలకు జైలు విధానాలను ప్రదర్శించడం ఆకట్టుకుందన్నారు. మ్యూజియంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఛాయాచిత్రాలు కట్టిపడేసాయన్నారు. నాటి శిక్షలను ఏ విధంగా అమలు చేసారో అర్థమయ్యే విధంగా చిత్ర ప్రదర్శన ఉందన్నారు. బంగ్లాదేశ్ రాజధానిలో 200 సంవత్సరాల క్రితం బ్రిటీష్ ప్రభుత్వం నిర్మించిన జైలు 54 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నారు. ఈ జైలులో ప్రస్తుతం 6 వేల మంది ఖైదీలు శిక్షలను అనుభవిస్తున్నారని స్పష్టం చేసారు.
200 ఎకరాల స్థల విస్తీర్ణంలో కొత్త జైలు భవనాన్ని నిర్మిస్తున్నామని, పాత జైలును కూడా సంగారెడ్డి జైలు మ్యూజియంగా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వివరించారు. జైలు మ్యూజియాన్ని ఏర్పాటు చేసిన తీరుతో పాటుగా ఆయా రకాల వస్తువుల సేకరణను జైలు సూపరింటెండెంట్ సంతోష్‌కుమార్ రాయ్‌ను అడిగి తెలుసుకున్నారు. జైళ్ల విధి విధానాలపై అధ్యయనం చేయడానికి అనుమతించిన భారత ప్రభుత్వానికి, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు తెలంగాణ జైళ్ల శాఖ డిజికి ఆ బృందం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. జైలు మ్యూజియంలో ఉన్న ప్రతి ఒక్క చిత్రాన్ని, పరికరాలను బృందం సభ్యులు స్మార్ట్ ఫోన్లలో చిత్రీకరించుకోవడం విశేషం.