తెలంగాణ

వికటించిన ‘కాన్పు’ చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోస్గి, అక్టోబర్ 21: సర్కార్ దవాఖానాలోని సేవలపై నమ్మకం లేక మెరుగైన చికిత్సలను ఆశించి ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పు కోసం వెళ్తే.. తల్లీబిడ్డలు ప్రాణాలు కొల్పోయిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా కొడంగల్ మండలం పర్తాపూర్ గ్రామానికి చెందిన శామప్ప, మల్లమ్మల కుమార్తె సావిత్రి (20)ను దామరగిద్ద మండలం దేశాయపల్లి గ్రామానికి చెందిన గొల్ల నిలప్పకు ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం జరిపారు. మొదటి కాన్పు నిమిత్తం సావిత్రి తల్లిదండ్రులు ఆమెను కోస్గిలోని బాలాజీ నర్సింగ్ హోంలో గురువారం చేర్పించారు. కొంతసేపటికి పురిటి నొప్పులు ప్రారంభంకాగా సాధారణ కాన్పు కోసం వైద్య సిబ్బంది ప్రయత్నించారు. కాగా, పురిటినొప్పులు మరింత తీవ్రతరం కావడంతో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రికి చెందిన నర్సులే బలవంతంగా నార్మల్ డెలివరీ జరిగేందుకు తీవ్రంగా యత్నించారు. ఈ ప్రయత్నంలో చికిత్సలు వికటించి శిశువు మృతి చెందగా కొంతసేపటికి తల్లి కూడా మృతి చెందింది. అయితే, అప్పటికే ఈ విషయం బయటికి పొక్కడంతో అప్రమత్తమైన ఆసుపత్రి యజమాన్యం చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించాలంటూ హడావిడి చేస్తూ సావిత్రి మృతదేహాన్ని అంబులెన్స్‌లోకి మార్చి అక్కడి నుండి తరలించారు. అనంతరం ఆసుపత్రి గేటుకు తాళం వేసి పరారయ్యారు. మృతురాలి బంధువులు, ప్రజలు ఆసుపత్రిలో ఉన్న శిశువు మృతదేహాన్ని ఆసుపత్రి బయటకు తీసుకువచ్చి ఆందోళనకు దిగారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో కోస్గి ఎస్సై మల్లారెడ్డి, నారాయణపేట సిఐ చంద్రశేఖర్‌రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నాలుగు గంటల చర్చ అనంతరం మృతురాలి బంధువులు శాంతించారు.
జిల్లా ఉపవైద్యాధికారి సందర్శన
సరైన చికిత్సలు లేక తల్లీబిడ్డలు మృతి చెందిన బాలాజీ నర్సింగ్ హోంను శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఉప వైద్యాధికారి సౌభాగ్యలక్ష్మి సందర్శించారు. ఆసుపత్రి నిర్వహణ తీరును పరిశీలించారు. వివిధ రికార్డులను పరిశీలించి కొన్నింటిని ఆమె తన వెంట తీసుకెళ్లారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు.
కాగా, మృతురాలి తండ్రి శామప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోస్గి ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మృతి
బోధన్, అక్టోబర్ 21: ప్రస్తుత కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు విఠల్‌రెడ్డి (78) శుక్రవారం మృతి చెందారు. బోధన్ పట్టణంలోని తన కుమార్తె ఇంట్లో నివాసముంటున్న ఆయన గత కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధ పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన బోధన్ పట్టణంలోని తన కుమార్తె స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జుక్కల్ నియోజకవర్గంలో ఆయన రెండుసార్లు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1966 నుండి 1977 వరకు ఆయన శాసనసభ్యునిగా కొనసాగారు. జుక్కల్ నియోజకవర్గంలో గల నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ కమిటీలో సభ్యునిగా కొనసాగారు. రాజకీయ జీవితంలో నిస్వార్థపరునిగా పనిచేసి మంచి గుర్తింపును పొందారు. 2011 నుండి ఆయన అనారోగ్యంతో బాధపడుతూ పలు ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందారు. ఆయన మృతి పట్ల వివిధ పార్టీల నాయకులు సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. శనివారం నాడు బోధన్ పట్టణంలో విఠల్‌రెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి.