తెలంగాణ

విద్యావ్యవస్థ ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మెడికల్, అగ్రికల్చర్, ఫార్మా మినహా మిగతా అన్ని స్థాయిల విద్యాసంస్థల నిర్వహణ బాధ్యతను విద్యాశాఖకే అప్పగించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. బడ్జెట్ రూపకల్పన సందర్భంగా వివిధ శాఖలను కూలంకషంగా ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. దీంట్లో భాగంగా విద్యాశాఖపై సిఎం దృష్టిసారించారు. రాష్ట్రంలో అన్ని రకాల సంస్థలను విద్యాశాఖ పరిధిలోకి తెచ్చే అంశంలో సమగ్ర అధ్యయనం చేసి, కొత్త విధానం రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి, సిఎస్‌ను సిఎం కెసిఆర్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం విద్యాశాఖ ప్రక్షాళనపై చర్చించారు. ప్రస్తుత విద్యా విధానంవల్ల విద్యార్థులు నిరుద్యోగులుగా మారుతున్నారు తప్ప ఉద్యోగావకాశాలు పొందలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. అలా కాకుండా అవసరమయ్యే విద్య అందించే విధంగా రాష్ట్ర విధానంగా ఉండాలని సూచించారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి కొత్త విద్యా విధానానికి రూపకల్పన జరగాలని ఆదేశించారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థ అంతా అడ్డదిడ్డంగా, అస్తవ్యస్తంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యాసంస్థలు, స్టీడీ సర్కిళ్లు ఇలా వేర్వేరు విద్యాసంస్థలు వేర్వేరు శాఖల నిర్వహణలో ఉన్నాయి. సిఎం ఇటీవల మైనార్టీల కోసం 60 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించారు. మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా నిధులు విడుదల చేసి, విద్యాశాఖ నిర్వహణ, నియంత్రణలో రెసిడెన్షియల్ స్కూళ్లను ఉంచాలని నిర్ణయించారు. ఇదే తరహాలో ఎస్సీ, ఎస్టీ, బిసి తదితర శాఖల నిధులతో నడిచే విద్యాసంస్థలు, సొసైటీలు, స్టడీ సర్కిళ్లున్నాయి. కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఐటిఐలు నడుస్తున్నాయి, ఇలా విద్యాసంస్థలన్నీ ఒకదానితో ఒకదానికి సంబంధం లేకుండా వేర్వేరుగా ఉన్నాయి. అలా కాకుండా వీటన్నింటినీ విద్యాశాఖ గొడుగు కిందికే తీసుకురావాలని ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా నిర్ణయించారు. విద్యాసంస్థలు వేర్వేరుగా నిర్వహించడం వల్ల సమగ్రత లోపించడం వల్ల విద్యార్థులకు అవసరమైన విద్య, ఉద్యోగావకాశాలు పెంచే శిక్షణ అందడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలాగే రాష్ట్రంలో, దేశంలో ఏఏ ఉద్యోగావకాశాలు ఉన్నాయో తెలుసుకుని, వాటికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే పని కూడా జరగడం ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాతీయ స్థాయిలో నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న పరీక్షల గురించి మాత్రమే అటు విద్యార్థులు, ప్రభుత్వం దృష్టి పెడుతుం. ఈ రెండే కాకుండా ఇంకా దేశవ్యాప్తంగా ఉద్యోగాకాశాలున్నా, వాటికి సంబంధించిన సమాచారం విద్యార్థులకు అందడం లేదు. విద్యార్థులను ఆ పరీక్షల కోసం సిద్ధం చేయడం లేదు. వీటికి తోడు దేశవ్యాప్తంగా ఉద్యోగవకాశాలు ఉన్నా రంగాలు అనేకం రోజు రోజుకు పెరుగుతున్నాయి. అటు విద్యావ్యవస్థ, ఇటు ఉద్యోగావకాశాలున్న రంగాలు కొత్త పుంతలు తొక్కుడంతో పాటు కొత్త ధోరణులు, కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఐటి రంగం విస్తరిస్తుంది. అందులో ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా చాలా రంగాల్లో అవకాశాలు వస్తున్నాయి, దీనికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నారు. అవసరాలకు తగిన విధంగా విద్యార్థులు కోర్సులను ఎంపిక చేసుకోవడం లేదు. తెలంగాణకు ఎంత మంది డాక్టర్లు కావాలి, ఎంత మంది ఇంజనీర్లు కావాలి? ఇంకా ఏఏ ఉద్యోగాలకు ఎంత మంది అవసరం ఉందనే అంచనా విద్యాశాఖకు ఉండాలి. దాని వల్ల విద్యార్థులను ఆయా ఉద్యోగాలకు సిద్దం చేసే అవకాశం ఉంటుంది. గతంలో దేశవ్యాప్తంగా మోడల్ స్కూళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ చాలా చోట్ల ఈ పథకం అమలు కావడం లేదు. కొన్ని రాష్ట్రాలు మోడల్ స్కూల్ ప్రతిపాదనలను తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మోడల్ స్కూళ్ల విషయంలో కూడా ఓ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.