తెలంగాణ

బాల వికాసకు సంపూర్ణ సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బాల వికాస సంస్థ పేదలు, మహిళల కోసం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, ఆ సంస్థకు ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎల్‌బి స్టేడియంలో మంగళవారం బాల వికాస సంస్థ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు ముఖ్యమంత్రి కెసిఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు తదితర ప్రముఖులు హాజరయ్యారు. బాల వికాస సంస్థ 15 వేల స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి అన్నారు. సంఘటిత శక్తిలో ఉండే శక్తిని ప్రజలకు చాటి చెప్పడంలో బాల వికాస సఫలీకృతం అయిందన్నారు. సంకల్పం ఉంటే ఎంత కష్టమైనా సాధించవచ్చని, ప్రజలు సంఘటితమైతే దేశాభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రజా సేవలో బాల వికాసకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని తీర్చడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ఎల్‌బి స్టేడియంలో మంగళవారం బాల వికాస సంస్థ
సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్