తెలంగాణ

వైభవంగా జోగులాంబదేవి వార్షిక బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న మహబూబ్‌నగర్ జిల్లా, అలంపూర్‌లోని శ్రీ జోగులాంబదేవి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను మంగళవారం వైభవంగా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శ్రీనివాసమూర్తి, ఇఓ గురురాజ, చైర్‌పర్సన్ లక్ష్మినారాయణరెడ్డి ప్రారంభించారు. మాఘశుద్ధపాడ్యమి నుంచి మాఘశుద్ధపంచమి వరకు నిర్వహిస్తున్నట్లు చైర్‌పర్సన్ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు కొనసాగిస్తున్నారు. సాయంత్రం ధ్వజారోహణం, పూజా కార్యక్రమాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గల ధ్వజస్థంభం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఐదు రోజులపాటు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీశైలం డ్యాంను పరిశీలించిన
భద్రతా నిపుణుల బృందం
శ్రీశైలం ప్రాజెక్టు, ఫిబ్రవరి 9: శ్రీశైలం డ్యాంను భద్రతా ప్యానల్ కమిటీ నిపుణుల బృందం డ్యాం అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ప్యానల్ కమిటీ సభ్యులు కెవి సుబ్బారావు (విశ్రాంత సిఇ), ఆర్.సూర్యనారాయణ (విశ్రాంత సిఇ), సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సభ్యులు ఎం.గిరిధర్‌రెడ్డి (విశ్రాంత సిఇ)తోపాటు బృంద సభ్యులు డ్యాంను ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా డ్యాం మధ్య గ్యాలరీ, పైగ్యాలరీలను పరిశీలించి డ్యాం ఊటనీళ్లు డీవాటరింగ్‌కు కలిగే ఇబ్బందులను, 2009లో వచ్చిన వరదలలో డ్యాం దిగువన కొట్టుకుపోయిన కుడిగట్టు రక్షణ గోడ, ఎడమవైపున ఉన్న కొండచరియలను వారు పరిశీలించారు. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు గతంలో పరిశీలించి చేపట్టాల్సిన పనులపై పలు సూచనలు చేశారు. దీనితో ప్రాజెక్టు అధికారులు జలవనరుల శాఖకు ప్రతిపాదనలను పంపిన నేపథ్యంలో నిపుణుల బృందం డ్యాం పరిశీలనకు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సభ్యులతో పంపించారు. డ్యాం రక్షణ గోడలకు చేపట్టాల్సిన పనులు, రోడ్డుకు డ్యాం డౌన్‌సీంకు కనెక్టివిటీ ఎలా ఇవ్వాలనే అనే అంశాల గురించి పరిశీలించారు. ఈ సమావేశంలో సెంట్రల్ ఆర్గనైజెషన్ సభ్యులు సుందర్‌రాజన్, నర్సింహ్మారావు, ప్రాజెక్టు ఎస్‌ఇ బి.రాంబాబు, ఇఇ మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

తీరొక్క నైవేద్యాలు..
కోటొక్క మొక్కులు

అడవి తల్లి ఒడిలో వెల్లివిరిసిన భక్తిపారవశ్యం
నేడు కేస్లాపూర్‌లో గిరిజన సాంప్రదాయ దర్బార్

ఆదిలాబాద్, ఫిబ్రవరి 9: అడవి బిడ్డల ఇలవేల్పు ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతరలో భక్తుల తాకిడి మరింత పెరిగింది. మంగళవారం జాతరకు గిరిజన గూడేల నుండి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడంతో గిరిజనులతో పాటు గిరిజనేతరులు కూడా కెస్లాపూర్ బాట పట్టి నాగోబాను దర్శించుకున్నారు. అధికారులు, ప్రముఖుల తాకిడి పెరగడం, మరోవైపు ఆచార వ్యవహారాలకు పెట్టిందిపేరైన ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతి, సంప్రదాయాలను ఏమాత్రం తగ్గకుండా నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. మంగళవారం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ సతీసమేతంగా నాగోబాను దర్శించుకుని పూజలు జరిపారు. ఇదిలాఉంటే మెస్రం వంశీయుల ప్రత్యేక పూజలు, సహపంక్తి భోజనాలు, చెట్ల కింద ఆత్మీయ పలకరింపులతో కెస్లాపూర్ జాతరలో పండగ వాతావరణం కనిపించింది. వేలాది మంది భక్తుల తాకిడితో జాతర కిటకిటలాడింది. నాగోబాకు ప్రత్యేక పూజల అనంతరం మెస్రం వంశీయులు తమ ఆచారంలో భాగంలో మంగళవారం పెర్సాపేన్, బన్‌దేవత, సతి దేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కెస్లాపూర్ జాతరను ప్రభుత్వ పండగగా గుర్తించడంతో ఐటిడిఎ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు జాతరలో ప్రత్యేక స్టాళ్ళను ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వాడకం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటుండగా మరోవైపు తినుబండారాల్లో కల్తీ పదార్థాలకు తావులేకుండా అధికారులు పర్యవేక్షణ జరుపుతున్నారు. రాత్రి వేళల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఐటిడిఎ పివో కర్ణన్ ఆదేశించారు. ఈనెల 11 వరకు జరిగే జాతర సంధర్భంగాజిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ ఆదివాసీల సంస్కృతిని చాటిచెప్పే విధంగా ప్రదర్శనలు గావిస్తున్నారు.
నేటి దర్బార్‌కు ప్రత్యేక ప్రాధాన్యత
కెస్లాపూర్‌లో వారం రోజుల పాటు జరిగే నాగోబా జాతర సందర్భంగా గిరిజన దర్బార్‌కు ప్రత్యేక స్థానం ఉంది. 1946లో మానవ పరిణామ శాస్తవ్రేత్త హేమాన్‌డార్ఫ్ నేతృత్వంలో కెస్లాపూర్ జాతరలో ఒకరోజు ఏర్పాటు చేసిన గిరిజన దర్బార్ ఇప్పటికీ ప్రతి ఏటా నిర్వహిస్తూ అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు గిరిజనులు తమ సమస్యలు విన్నవిస్తున్నారు. వాటిపై సత్వర పరిష్కారం కోసం అధికారులు హామీలిస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. అయితే బుధవారం జరిగే గిరిజన దర్బార్‌కు భారీ సంఖ్య లో భక్తులు తరలివచ్చి మంత్రులకు సమస్యలు విన్నవించనున్నారు. ఈ దర్బార్‌కు ఈసారి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న గిరిజన శాఖ మంత్రి చందులాల్‌తో పాటు శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపిలు, జిల్లా ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.