తెలంగాణ

రేవంత్‌రెడ్డికి ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 26: ఓటుకు నోటు కేసులో నిందితుడు, టిటిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ప్రతి సోమవారం అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. కాగా ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారించి ఇకపై ప్రతి సోమవారం రేవంత్ రెడ్డి ఏసిబి ఆఫీసుకు హాజరు కాకుండా మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ సురేష్ కుమార్ కైత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ నిందితుడిపై ఏసిబి దర్యాప్తు ముగిసిందని, చార్జిషీటు కూడా దాఖలు చేసిందని తెలిపారు. ప్రతి సోమవారం ఏసిబి కార్యాలయానికి రేవంత్ రెడ్డి హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని న్యాయవాది రవికిరణ్ రావు కోరారు. అనంతరం హైకోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నామని, కాని ఏసిబి ఎప్పుడు కోరితే అప్పుడు కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. కాగా రేవంత్ రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏసిబి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసు దర్యాప్తు ముగిసినందున, చార్జిషీటు దాఖలైనందు వల్ల బెయిల్ రద్దు చేయాలన్న వాదనలో పసలేదని హైకోర్టు పేర్కొంది.