తెలంగాణ

సచివాలయాన్ని కూలిస్తే కోర్టుకెళ్తా: కోమటిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 26: వాస్తు పేరిట సచివాలయంలోని భవనాలను కూల్చి వేయడానికి చర్యలు చేపడితే తాను కోర్టుకు వెళతానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. వాస్తు బాగాలేదని సచివాలయంలోని భవనాలను కూల్చి వేసి తిరిగి 350 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు భావించడం భావ్యం కాదని ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అలా చేస్తే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని ఆయన తెలిపారు. పేదల వైద్యానికి ఎంతో ఉపయోగపడుతున్న ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల చేయలేదని, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు విడుదల చేయలేదని ఆయన చెప్పారు.
అంతేకాకుండా ఇప్పటి వరకు రైతుల రుణ మాఫీ చేయలేదని అన్నారు. వీటికి నిధుల కొరత ఉన్నప్పుడు కొత్తగా భవనాల నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

దయా మృతదేహం
సోదరులకు అప్పగింత
దాసిరెడ్డిగూడెంలో నేడు అంత్యక్రియలు
వలిగొండ, అక్టోబర్ 26: నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలోని దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన అజ్ఞాత మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒరిస్సా బార్డర్ జోనల్ కార్యదర్శి చామల కిష్టయ్య అలియాస్ దయా మృతదేహానికి గురువారం అంత్యక్రియలు జరుగనున్నాయ. సోమవారం ఎఓబి సరిహద్దులోని బూసుపుట్టి ప్రాంతంలోని ఎన్‌కౌంటర్‌లో దయా మృతి చెందిన విషయం తెలిసిందే. దాదాపు 26 సంవత్సరాల క్రితం ఇంటి నుండి వెళ్లిన దయా మృతదేహాన్ని గుర్తించేందుకై మల్కన్‌గిరికి వెళ్లిన సోదరుడు చామల నర్సింహ్మా ఆ మృతదేహం తన సోదరుడు దయాదేనని తెలియజేయడంతో అతనికి అప్పగించారు. కాగా, దయా సోదరులు మృతదేహాంతో స్వగ్రామానికి తిరిగి వస్తుండడంతో గురువారం అంత్యక్రియలకు బంధువులు ఏర్పాటు చేస్తున్నారు.
చిన్న జీయర్‌స్వామి షష్టిపూర్తి 6న
ఎల్‌బి స్టేడియంలో భారీ ఏర్పాట్లు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 26: వచ్చే నెల 6వ తేదీన శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి వసంతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చిన్న జీయర్ స్వామి ట్రస్టు భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు నగరంలోని ఎల్‌బి స్టేడియంను ముస్తాబు చేస్తున్నారు. ట్రస్టులో ముఖ్య భూమిక పోషిస్తున్న బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి సారధ్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఎల్‌బి స్టేడియంలో సాయంత్రం నిర్వహించే శ్రీ చిన్న జీయర్ స్వామి తిరునక్షత్ర మహోత్సవ వేడుకల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ ప్రభృతులు పాల్గొంటారని చింతల రామచంద్రారెడ్డి బుధవారం ట్రస్టు ప్రతినిధులు ప్రొఫెసర్ పురుషోత్తం రావు, ఎర్నేని రామారావు, వేణుగోపాల్, ప్రేంరాజ్ తదితరులతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ వివరించారు.
శ్రీ చిన్న జీయర్ స్వామి షష్టిపూర్తి సందర్భంగా ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు వివిధ నిత్య విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే చింతల చెప్పారు. 6వ తేదీ స్టేడియంలో నిర్వహించే సభా కార్యక్రమం మినహా మిగతా కార్యక్రమాలన్నీ రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌లోని, ముచ్చింతల, శ్రీరామ నగరం, జీవా ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.