తెలంగాణ

తెలంగాణపై కయాంత్ ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరబాద్, అక్టోబర్ 27: కయాంత్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అప్రమత్తం చేశారు. ఈ తుఫాన్ ప్రభావం వల్ల తెలంగాణలో రెండు మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. మార్కెట్ కార్యదర్శులు, సిబ్బంది మార్కెట్‌లో అందుబాటులో ఉండాలని కోరారు. రైతుల సరుకులను షెడ్‌లలో పోయించాలని చప్పార. షెడ్లు నిండితే సరైన ప్రదేశాల్లో పోయించి, టార్పాలిన్‌లతో కప్పించాలని చెప్పారు. రైతులకు ఇంకా అవసరమైన టార్పాలిన్‌లు ఇవ్వడానికి అందుబాటులో ఉంచాలని చెప్పారు. మార్కెట్‌లోని లో తట్టు ప్రాంతాలలో సరుకులను పోయకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ధర నిర్ణయం అయిన వెంటనే కాంటాలు ప్రారంభించాలని , వ్యాపారులను సిద్ధం చేయాలని మార్కెటింగ్ అధికారులకు తెలిపారు. కొంత మంది రైతులు తమ పచ్చి సరుకులను మార్కెట్ యార్డులో ఆరబెట్టుకోవడానికి తీసుకు వస్తారని ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఆరబోసి ఇబ్బంది పడవద్దని రైతులకు సూచించారు.