తెలంగాణ

26మంది మావోయిస్టుల లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 8: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కొండగావ్ పోలీసులకు మంగళవారం పెను ముప్పు తప్పింది. మావోయిస్టులు కూంబింగ్ బలగాలను లక్ష్యంగా చేసుకొని ఏర్పాటు చేసిన మూడు కిలోల మందుపాతరను సకాలంలో గుర్తించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కొండగావ్ జిల్లా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు సమీప గ్రామాల్లో కూంబింగ్ నిర్వహించేందుకు వెళ్తున్న సమయంలో దీన్ని కనుగొన్నారు. వెంటనే బాంబ్‌స్క్వాడ్‌ను సంఘటన ప్రదేశానికి తరలించి మందుపాతరను నిర్వీర్యం చేసి వెలికితీశారు. ఈసల్‌నార్- హంగ్వా అటవీ ప్రాంతంలో కాలిబాటలో దీన్ని నక్సల్స్ అమర్చారు. గోలావండ్ దళం పనిగా దీన్ని పోలీసులు భావిస్తున్నారు. అక్కడ 100 మీటర్ల విద్యుత్ వైర్లు సైతం పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇదిలా ఉండగా సుకుమా జిల్లా పోలీసుల ఎదుట మంగళవారం 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఏడుగురిపై ప్రభుత్వ రివార్డు కూడా ఉన్నట్లు ఐజీ కల్లూరి మీడియాకు వెల్లడించారు. సుకుమా జిల్లా డోర్నపాల్ బ్లాకులోని పోలంపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో వీరు ఐజీ కల్లూరి, సీఆర్‌పీఎఫ్ డీఐజీ డీపీ ఉపాధ్యాయ్, సుకుమా ఎస్పీ బి.శ్రావణ్, బస్తర్ ఎస్పీ రాజేంద్ర నారాయణదాస్ సమక్షంలో లొంగిపోయినట్లు పేర్కొన్నారు.

మందుపాతరను నిర్వీర్యం చేస్తున్న బాంబ్ స్వ్కాడ్