తెలంగాణ

టిఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి వెళ్లి ఎండగట్టాలని, విబేధాలు విస్మరించి సమిష్టిగా పోరాడుదామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ కార్యక్రమంపై నిర్వహించిన సదస్సులకు జనం నుంచి వస్తున్న స్పందన విశేషంగా ఉందని, ఇదే ఊపుతో జనంలోకి వెళ్లాలని టిపిసిసి నేతలు నిర్ణయించారు.
గురువారం ఇక్కడ గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు సమావేశమై భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో టిపిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి, సిఎల్‌పినేత జానారెడ్డి, శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, ఎఐసిసి నేత కొప్పుల రాజు, ఎఐసిసి కార్యదర్శి ఆర్‌సి కుంతియా, ఎఐసిసి అధికార ప్రతినిధి మధూయాష్కీ, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, పలువురు నేతలు పాల్గొన్నారు.
రాష్ట్రప్రభుత్వం ఫీజు రీ ఎంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, పిఆర్‌సి బకాయిలు, డబుల్‌బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని టిపిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల హామీని మర్చిపోయి ఉత్తుత్తి మాటలతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని, ప్రచారాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు మల్లురవి, డికె అరుణ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీ్ధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. గురువారం గాంధీభవన్‌లో సమావేశమైన టి.కాంగ్రెస్ నేతలు