తెలంగాణ

అవినీతిని నిర్మూలించే మార్గాలేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: ‘ఇల్లు అమ్మేవాళ్లు అమ్ముతున్నారు. కొనే వాళ్లు డబ్బులిచ్చి కొంటున్నారు, మధ్యలో రిజిస్ట్రేషన్ చేసిన వారికి లంచం ఎందుకు? దీన్ని నివారించలేమా? ఏం చేస్తే బాగుంటుంది’ అని స్వయంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావువెలిబుచ్చిన అభిప్రాయం ఇది. వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతిని తగ్గించే అంశంపై సిఎం అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖలో, రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని అరికట్టేందుకు మార్గాలను అనే్వషిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని పౌర సరఫరాల శాఖలో 75శాతం వరకు అక్రమాలను అరికట్టగలిగామని, పూర్తి స్థాయిలో అక్రమాలను నివారిస్తామని, దీని కోసమే తొలిసారిగా ఐపిఎస్ అధికారిని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా నియమించినట్టు ఆ శాఖ మంత్రి వెల్లడించారు. పై స్థాయిలో అవినీతిని నిర్మూలించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా కింది స్థాయిలో ప్రజలకు నేరుగా సంబంధం ఉండే శాఖల్లో అవినీతి అలానే కొనసాగడం వల్ల ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో పేరు రాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంలో మహానగరం మొదలుకొని పట్టణాల వరకు ముడుపులు లేనిదే పనులు జరగడం లేదు. ఒకవైపు హైదరాబాద్ నగర విస్తరణ, మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల పట్టణీకరణ పెరుగుతున్న సమయంలో నిర్మాణాలు మరింతగా పెరుగుతాయని, దీనిని ప్రక్షాళన చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి నిర్ణయించారు. హెచ్‌ఎండిఏ, జిహెచ్‌ఎంసిలో ఏళ్లతరబడి తిష్టవేసిన వారిని తప్పించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులను ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చే వీలు కల్పిస్తూ మున్సిపల్ చట్టానికి సవరణలు తీసుకురానున్నారు. కింది స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆశించిన విధంగా లంచాలు లేకుండా పనులు జరిగే పరిస్థితి రావాలని, దాని కోసం చేయాల్సిన సంస్కరణలపై దృష్టిసారించారు. కింది స్థాయిలో లంచాలను నివారించినప్పుడే ప్రజల్లో ప్రభుత్వం పట్ల అవినీతి రహితమైన ప్రభుత్వం అనే పేరు ఉంటుందని, రాజకీయంగా టిఆర్‌ఎస్‌కు ఇది అనివార్యం అని ముఖ్యమంత్రి సన్నిహితులతో జరిపిన సమావేశంలో అభిప్రాయపడ్డారు. నగరంలోనైనా జిల్లాల్లో నైనా ఇళ్లు, ఫ్లాట్స్, రిజిస్ట్రేషన్ అంటే తప్పని సరిగా ముట్ట చెప్పాల్సిందేననేది వాస్తవం అని ముఖ్యమంత్రి ఈ అంశంపై కొద్ది మందితో జరిగిన సమావేశంలో చెప్పారు. మ్యూటేషన్, ల్యాండ్ రికార్డ్స్ ఎంతో కొంత లంచం తీసుకోనిదే పనలు జరగడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ల శాఖలో తెచ్చిన సంస్కరణలు అవినీతిని మాత్రం తగ్గించలేకపోయాయి. ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనైనా బ్రోకర్లను ఆశ్రయించి అడిగింది ముట్ట చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందే.రిజిస్ట్రేషన్ల కోసం సైతం ఎలాంటి సంస్కరణలు తీసుకు వస్తే లంచాలను నిర్మూలించే అవకాశం ఉందో చూడాలని ముఖ్యమంత్రి సమావేశంలో అడిగినట్టు తెలిసింది. టెక్నాలజీని ఉపయోగించుకుని రిజిస్ట్రేషన్లలో అవినీతికి ఆస్కారం లేకుండా చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.