తెలంగాణ

గులాబీ గూటికి మరో ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్టీకి ఆత్మవిశ్వాసం కలిగించేందుకు ఒకవైపు తెదేపా జాతీయ అధ్యక్షుడు ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఎమ్మెల్యేల పార్టీ మారడం ఆగడం లేదు. తాజాగా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తెరాసలో చేరారు. దీంతో ఇప్పటి వరకు తెదేపానుంచి తెరాసకు వెళ్లిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరుకుంది. 15మంది ఎమ్మెల్యేలు గెలిస్తే పదిమంది తెరాసకు వెళ్లిపోయారు. ఆర్ కృష్ణయ్య తనకు పార్టీతో సంబంధం లేదని, తాను బీసీల కోసమే పనిచేస్తానని ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లో బాబు నిర్వహించిన సమావేశానికి కూడా కృష్ణయ్య హాజరు కాలేదు. దాంతో ఇక తెదేపాలో మిగిలింది నలుగురు ఎమ్మెల్యేలే. తెదేపా శాసన సభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు తెరాసలో చేరడంతో రేవంత్‌రెడ్డిని శాసన సభాపక్షం నాయకునిగా చంద్రబాబు నియమించారు. ఈరోజే నియామకం జరగగా, ఇదే రోజు ఒక ఎమ్మెల్యే టిడిపిని వీడి టిఆర్‌ఎస్‌లో చేరడం విశేషం. తెలంగాణ టిడిపిలో మిగిలివున్న ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులకు ఆత్మవిశ్వాసం కలిగించేందుకు టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు గురువారం ఎన్టీఆర్ భవన్‌లో ఐదు గంటల పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొని పార్టీ పటిష్టత గురించి ఉపన్యసించిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సమావేశం ముగియగానే అటు అటే మంత్రులతో చర్చించి టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కె తారక రామారావులను కలిసిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి వారితో చర్చించి, పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రెండు రోజుల్లో తిరిగి వస్తారు. ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చాక, ఆయన సమక్షంలో టిఆర్‌ఎస్‌లో అధికారికంగా చేరనున్నట్టు రాజేందర్‌రెడ్డి తెలిపారు.
నియోజక వర్గం అభివృద్ధి కోసమే టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. 20 నెలల పాటు నియోజక వర్గంలో ఎలాంటి పనులు చేపట్టలేకపోయానని, అభివృద్ధి కోసమే పార్టీ మారాలని నిర్ణయించకున్నట్టు తెలిపారు.
15 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే పది మంది పార్టీ మారడంతో పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు స్పీకర్‌కు లేఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
రాజేశ్వర్‌రెడ్డి నిర్ణయం తెలియగానే టిడిపి నాయకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంతకు ముందే ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన సమావేశంలో రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ అందరం బాబు వెంటే ఉన్నామని ప్రకటించారు. తెలంగాణలో టిడిపి బలంగా ఉందని అన్నారు. కార్యకర్తల్లో విశ్వాసం కలిగించేందుకు ప్రయత్నించాలని తెలిపారు. చంద్రబాబు విజయవాడ వెళ్లిన తరువాత కొంత ఇబ్బంది కరమైన పరిస్థితి ఏర్పడిందని, బాబు హైదరాబాద్‌లోనే ఉంటే బాగుండేదని అన్నారు. హైదరాబాద్‌లో ఉండి బాబు తరుచుగా కార్యకర్తలను కలవాలని కోరారు. సమావేశం ముగిశాక చివరకు ఆయనే పార్టీ వీడి వెళ్లడం విశేషం. తెలంగాణ టిడిపిలో శూన్యం నెలకొందని, పార్టీకి భవిష్యత్తు లేదని, రాజేందర్‌రెడ్డి అభిప్రాయపడుతున్నారు.