తెలంగాణ

మేయర్‌గా రామ్మోహ న్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిప్యూటీగా బాబా ఫసియుద్దీన్ ఇద్దరి ఎన్నికా ఏకగ్రీవం నేడు పదవీ బాధ్యతల స్వీకారం
150 మంది కార్పొరేటర్ల పదవీ ప్రమాణం తెరాస అభ్యర్థులకు మజ్లిస్ మద్దతు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా బొంతు రామ్మోహన్ ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ ఎన్నికయ్యారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో తెరాస అప్రతిహత విజయాన్ని సాధించి 99 డివిజన్లు సొంతం చేసుకోవడంతో మేయర్ ఎన్నిక గురువారం ఏకగ్రీవమైంది. ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జ, ఎన్నికల పరిశీలకులు అశోక్‌కుమార్ పరిశీలనలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. తొలుత ఆయన తెరాసకు చెందిన 94, మజ్లిస్ నుంచి గెలిచిన 44, బిజెపి నుంచి నలుగురు, కాంగ్రెస్ ఇద్దరు, తెదేపాకు చెందిన ఒక కార్పొరేటర్ కలిపి మొత్తం 150మంది కొత్త కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. మూడు భాషల్లో ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్ ఎన్నికను నిర్వహించారు. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు మేయర్ పేరును ప్రతిపాదించాలని సూచించటంతో తెరాస తరపున వెంకటేశ్వరకాలనీ డివిజన్ కార్పొరేటర్ కవితా మనె్న గోవర్థన్ రెడ్డి మేయర్ పదవికి చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ పేరును ప్రతిపాదించగా, మీర్‌పేట హెచ్‌బి కాలనీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య బలపరిచారు. ఇతర పార్టీలేవీ అభ్యర్థులను ప్రతిపాదించకపోవటంతో మేయర్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జ ప్రకటించారు. అనంతరం డిప్యూటీ మేయర్ పదవీకి తెరాస నుంచి అభ్యర్థిని ప్రతిపాదించాలని సూచించటంతో అమీర్‌పేట కార్పొరేటర్ శేషుకుమారి బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దిన్ పేరును ప్రతిపాదించగా, రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి బలపరిచారు. మజ్లిస్‌కు చెందిన అహ్మద్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ అయేషా రుబీనా మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులకు తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలిపారు.
అనంతరం ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జ మేయర్‌గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసీయుద్దిన్‌లు ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించి, వారికి ఎన్నిక ధ్రువీకరణ పత్రాలు అందించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ మంత్రి టి.పద్మారావు, వాణిజ్యపన్నుల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు బిజెపి శాసన సభ పక్ష నేత కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులతో కలిపి మొత్తం 44మంది ఎక్స్ అఫీషియో సభ్యులు హజరయ్యారు.
అనంతరం ఎక్స్ ఆఫీషియో సభ్యులు, కార్పొరేటర్లు, పలువురు అధికారులు మేయర్, డిప్యూటీ మేయర్లను అభినందించారు. ఎన్నిక అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ కాలినడకన అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళి అర్పించారు.

చిత్రం.. 1. ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జ నుంచి మేయర్ ఎన్నిక ధ్రువీకరణ పత్రం స్వీకరిస్తున్న బొంతు రామ్మోహన్

2. ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జ నుంచి డిప్యూటీ మేయర్ ఎన్నిక ధ్రువీకరణ పత్రం స్వీకరిస్తున్న బాబా ఫసియుద్దీన్