తెలంగాణ

జనవరి 17న గ్రేటర్ ఎన్నికలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి ఎన్నికల పోలింగ్ జనవరి 17న జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో మంత్రి కెటిఆర్ జనవరి 17నే పోలింగ్ జరగుతుందని ప్రకటించటంతో సంక్రాంతి 14నుంచి 16వరకు సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత 17న పోలింగ్ నిర్వహించేందుకు వీలుగా నెలాఖరులో నోటిఫికేషన్ విడుదలచేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్ల పునర్విభజనను జిహెచ్‌ఎంసి పూర్తి చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం బీసీ ఓటర్ల గణాంకాలు సేకరించిన అధికారులు శుక్రవారం డివిజన్ల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి చేశారు. ఈమేరకు ప్రతిపాదనలను సర్కారుకు పంపారు. మొత్తం 150 డివిజన్లలో 106 డివిజన్లను వివిధ సామాజిక వర్గాలకు రిజర్వుచేయగా, మరో 44 డివిజన్లను అన్ రిజర్వు చేస్తూ సర్కారుకు అందించిన ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఇందులో బీసీల జనాభా ఎక్కువగావున్న తొలి 50 డివిజన్లకు బీసీ సామాజిక వర్గానికి, వాటిలో 25 మహిళలకు కేటాయిస్తున్నారు. అలాగే మహిళ జనరల్ క్యాటగిరికి 44, ఎస్సీల జనాభాను బట్టి 10 స్థానాలు కేటాయించగా, ఇందులో 5 ఎస్సీ జనరల్, 5 ఎస్సీ మహిళలకు, ఎస్టీల జనాభాను బట్టి రెండు సీట్లు, ఇందులో ఒకటి ఎస్టీ మహిళకు, అలాగే అన్ రిజర్వుడు క్యాటగిరీ కింద మరో 44 డివిజన్లను కేటాయిస్తూ అధికారులకు సర్కారుకు ప్రతిపాదనలు పంపినట్టు కమిషనర్ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. మొత్తానికి రిజర్వు అయిన 106 డివిజన్లలోనూ వివిధ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు సగం శాతం కేటాయించటంతో మొత్తం 150 సీట్లలో 75 సీట్లు మహిళలకు దక్కాయి. దీంతో కొత్తగా ఎన్నికకానున్న పాలక మండలి సగంమంది మహిళలతో కొలువుదీరనుంది.