తెలంగాణ

రియల్టర్ల అక్రమాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: పట్టణీకరణ వేగంగా జరుగుతున్న హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ అక్రమాలు, మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక అథారిటీ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై జారీ చేసిన విధి విధానాలపై రాష్ట్రంలో కూడా రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీని నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. బిల్డర్లు, డెవలపర్లు తాము నిర్మించే బహుళ అంతస్తు భవనాలు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, షాపింగ్ కాంప్లెక్సులకు సంబంధించి ముందుగానే కొనుగోలుదారుల నుంచి బుకింగ్‌లు చేసుకుని ఆ తర్వాత వారికిష్టమొచ్చిన విధంగా ఆడించటానికి వీలు లేకుండా ఈ అథారిటీ చెక్ పెట్టనుంది. రెసిడెన్షియల్, కమర్షియల్ అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్స్ కొనుగోలు చేసే వినియోగదారులకు, నిర్మాణదారుల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించే వేదికగా ఈ అథారిటీ ఏర్పాటు కానుంది. భవనం గానీ, అపార్ట్‌మెంట్‌గానీ నిర్మించకముందే ఫ్లాట్లు బుక్ చేసుకునే బిల్డర్, డెవలపర్లు స్థానిక సంస్థల నుంచి పొందే ప్లాన్, అనుమతులను ఏ మాత్రం ఉల్లంఘించకుండా నిర్మించే విధంగా, అలాగే ముందుగా ఫ్లాట్లన్నీ బుక్ చేసుకుని, విక్రయించిన తర్వాత కొనుగోలుదారుడి అనుమతి లేకుండా ఎలాంటి మార్పులు చేసేందుకు వీల్లేదన్న కఠిన నిబంధనలు ఈ అథారిటీ అమలు చేయనున్నట్లు టౌన్‌ప్లానింగ్ అధికారులు తెలిపారు. ఇప్పటికే అథారిటీలను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తుండగా, మహారాష్ట్ర సర్కారు నిబంధనలను జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
కేంద్రం జారీ చేసిన నింబంధనలు
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన ఈ రెగ్యులారిటీ అథారిటీలో కనీసం 20 ఏళ్ల పాటు పట్టణాభివృద్ధి శాఖలో పనిచేసిన సీనియర్ అధికారిని చైర్ పర్సన్‌గా నియమించాలి. చైర్మన్‌తో పాటు మరో ఇద్దరు సభ్యులను నియమించి, ఆ ఇద్దరు కనీసం ప్రభుత్వ కార్యదర్శి హోదాలో పని చేసి ఉండాలి. అందులో ఒకరు టెక్నికల్ పర్సన్ అయి ఉండాలి. జిహెచ్‌ఎంసి లాంటి గ్రేటర్ మున్సిపాలిటీల్లో ఇలాంటి అథారిటీ ఏర్పాటైన వెంటనే బిల్డర్లు, డెవలపర్లు అంతా ఇందులో తప్పకుండా తమ వివరాలను రిజిష్టర్ చేసుకోవాలి. భవనం నిర్మించకముందు కొనుగోలుదారులిచ్చిన హామీలు, వాగ్దానాలన్నింటినీ బిల్డర్లు నెరవేర్చేలా ఈ అథారిటీ మానిటరింగ్ చేస్తోంది. ఒక్కో వెంచర్ మొత్తంలో బిల్డర్ సంపాదించే మొత్తంలో సుమారు 70 శాతం ఆ వెంచర్‌లోనే వెచ్చించే నిబంధనను ఈ అథారిటీ అమలు చేస్తోంది. నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినా, ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారిని నిర్మాణదారులు మోసం చేసినా చర్యలు తీసుకునే వెసులుబాటు స్థానిక సంస్థల చట్టాల్లో ఉన్నా, దానికున్న ప్రక్రియ చాలా పెద్దది. ఈ అథారిటీ అందుబాటులోకి వస్తే చైర్‌పర్సన్ తక్కువ సమయంలోనే ఫిర్యాదును పరిశీలించి బాధ్యులకు శిక్ష విధించే అవకాశముంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు ఇతర సిట్టింగ్, రిటైర్డు జడ్జిలను చైర్మన్లుగా నియమించుకుని, రియల్ ఎస్టేట్ వినియోగదారుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తూ, జాప్యం లేకుండా బాధ్యులకు న్యాయశాఖపరమైన శిక్షలను కూడా అమలు చేసే వెసులుబాటు కల్పించేలా విధి విధానాలున్నాయని జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. కేంద్రం జారీ చేసిన విధి విధానాల్లో ఫిర్యాదులకు సంబంధించిన నిర్మాణాలు ఆన్‌గోయింగ్ కన్‌స్ట్రక్షన్ అని పేర్కొంది. కటాఫ్ తేదీ అంటూ నిర్ణయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అథారిటీని ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు జిహెచ్‌ఎంసి జారీ చేసిన అనుమతులు, ఆమోదించిన ప్లాన్‌లను ఈ అథారిటీ వెబ్‌సైట్‌లో పెట్టనున్నట్లు, తద్వారా ఫ్లాట్లను కొనుగోలు చేసే వారికి బిల్డర్ల ఎక్కడెక్కడ ఎంతవరకు ఉల్లంఘనకు పాల్పడ్డారో తెలుసుకుని, అక్రమంగా నిర్మించిన భవనాల్లోని ఫ్లాట్లను కొనుగోలు చేసి మోసపోకుండా ఉంటుందని జిహెచ్‌ఎంసి అధికారులు భావిస్తున్నారు.