తెలంగాణ

మెదడువాపు బాధిత జిల్లాలో అధికారుల పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, నవంబర్ 5: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాను మెదడువాపు (జపనీస్ ఎన్‌సైఫలైటిస్) వ్యాధి వణికిస్తున్న నేపథ్యంలో ఆ జిల్లాలో శనివారం న్యూఢిల్లీలోని ఎన్‌విపిడిసిపి (నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం) అడిషనల్ డైరెక్టర్ డా.పి.కె.సేన్ నేతృత్వంలోని 9 మంది వైద్యుల బృందం పర్యటించింది. ఇప్పటి వరకు ఈ జిల్లాలో 69 మంది చిన్నారులు మెదడువాపు వ్యాధితో కన్నుమూశారు. ఇంకా 200 మంది చిన్నారుల్లో ఈ వ్యాధిని గుర్తించగా వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. ఈ జిల్లాలోని కలిమెల, పొడియా, కోరుకొండ బ్లాకుల్లో గల చిత్రకొండ, రాళ్లెగడ్డ, గుండువాడ, పిల్లగెడ్డ, కాట్రగడ్డె గ్రామాల్లో మెదడు వాపు వ్యాధి విజృంభిస్తోంది. అదుపులోకి రాకపోగా అంతకంతకు పెరుగుతోంది. ఒకే ఇంట్లో ఇద్దరు చిన్నారులు చనిపోయిన హృదయవిదారకర ఘటనలు పలువురిని చలింప చేస్తున్నాయి.
ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో న్యూఢిల్లీలోని ఎన్‌విబిడిసిపి అడిషనల్ డైరక్టర్ డా. పి.కె.సేన్ హుటాహుటిన తన 9 మంది వైద్యబృందంతో ఈ గ్రామాల్లో పర్యిటించి వ్యాధికారకాలపై అధ్యయనం ప్రారంభించారు. ముందుగా చిన్నారులు చనిపోయిన గ్రామాల్లో వాతావరణ పరిస్థితులను వారు పరిశీలించారు. 2012, 2015ల్లో కూడా ఇక్కడ ఈ వ్యాధి వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి అధ్యయానికి శ్రీకారం చుట్టినట్లు డా.పి.కె.సేన్ వెల్లడించారు.