తెలంగాణ

విషజ్వరాలపై 15లోగా నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: రాష్ట్రంలో విషజ్వరాల నివారణకు తీసుకున్న ప్రభుత్వం చర్యలపై ఈ నెల 15 లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సి) ఆదేశించింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయని, ప్రజలు, ముఖ్యంగా పేదలు ఈ జ్వరాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) ఒక నివేదిక ద్వారా మానవహక్కుల కమిషన్‌కు తెలియచేసింది. జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఒక బృందం ఇటీవల ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల గ్రామంతో పాటు గిరిజన ప్రాంతాల్లో పర్యటించి వచ్చింది. ఖమ్మంతో పాటు ఇతర జిల్లాల్లో విషజ్వరాలతో జనం బాధలు పడుతున్నారని, బాధితులను ఆదుకోవడంతో పాటు విషజ్వరాలను నివారించేందుకు చర్యలు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను కోరుతూ జెఎసి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.