తెలంగాణ

నాపై కక్ష సాధిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: గ్యాంగ్ స్టర్ నరుూం కేసులో సిట్‌తో దర్యాప్తు నిర్వహిస్తే నిజాలు బయటపడవని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. నరుూం చీకటి వ్యవహారాలతో అధికార పార్టీ నేతలకు సంబంధాలున్నాయని, అందుకే ప్రభుత్వం ఈ కేసును సిబిఐతో కాకుండా సిట్‌తో దర్యాప్తు జరిపిస్తోందని ఆయన ఆరోపించారు. శనివారం రాత్రి శంషాబాద్‌లో జరిగిన జిల్లా బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ, నరుూం కేసులో తనను విచారించడం కక్ష సాధింపు చర్యేనన్నారు. రాజ్యాధికారంతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని, దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలను అగ్రవర్ణాలు ఓటు బ్యాంకుగా మర్చేశాయని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించేలా పార్లమెంటు, శాసనసభల్లో బిల్లులను ఆమోదింపజేయాలని, అలాగే బీసీలకు కూడా నామినేటెడ్ పదవులు కేటాయించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన బీసీ నాయకులు పాల్గొన్నారు.