తెలంగాణ

జిల్లా కమిటీలపై టిఆర్‌ఎస్ మల్లగుల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ ప్రభు త్వం కొత్త జిల్లాలను సునాయాసంగా ఏర్పాటు చేసినా జిల్లా కమిటీల ఏర్పాటుపై మాత్రం మల్ల గుల్లాలు పడుతోంది. కొత్త జిల్లాలకు కమిటీలను ఖరారు చేసినా ఒకటి రెండు జిల్లాల విషయంలో చివరి నిమిషం వరకు మార్పులు చేర్పులతో కమిటీలను ప్రకటించలేదు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ఉత్సాహంగా ముందుకు వెళ్లగా, కొత్త జిల్లాలకు కొత్త కమిటీలను ఏర్పాటు చేయడంలో విపక్షాలు ముందున్నాయి. వామపక్షాలు కొత్త జిల్లాలకు కొత్త కమిటీలను అందరి కన్నా ముందు నియమించాయి. టిడిపి తొలుత హడ్‌హక్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అడ్‌హక్ కమిటీల ఏర్పాటుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అనుమతి తీసుకున్నారు. తొలుత హడ్‌హక్ కమిటీలు ఏర్పాటు చేసి తరువాత పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఇక అధికార పక్షం మాత్రం గత వారం రోజుల నుంచి జిల్లా కమిటీల ఏర్పాటు ఎప్పటికప్పుడు నేడో రేపో అని చెబుతోంది. పేర్లు ఖరారు అయినప్పటికీ ప్రకటించలేదు. సోమవారం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నాయకులు తెలిపారు. అభిప్రాయ సేకరణ, జాబితా రూపకల్పన అన్నీ మ ముగిసిపోయినందున సోమవారం ప్రకటించేందుకు ఇబ్బంది ఏమీ ఉండదని పార్టీ నాయకులు చెబుతున్నారు. పాత జిల్లాలు పది, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు 21 మొత్తం 31 జిల్లాలకు కూడా కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తారు. గతంలోని పాత జిల్లాల కమిటీల్లోని పలువురికి రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించనున్నారు. అదే విధంగా జిల్లా కమిటీల్లోని పలువురు సభ్యులు కొత్తగా ఏర్పడిన వేరు వేరు జిల్లాల పరిధిలోకి వెళతారు కాబట్టి మొత్తం 31 జిల్లాలకు కొత్తకమిటీలు వేస్తారని పార్టీ నాయకులు తెలిపారు.