తెలంగాణ

రూ.6880 కోట్లతో మిషన్ భగీరథ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని, అందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్ ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లాకే దాదాపు రూ.6880 కోట్లు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించామని, పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. శనివారం జిల్లాలో స్మితా సంబర్వాల్ రెండవ రోజు పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా కల్వకుర్తి, ఆమనగల్లు, వెల్ధండలో చేపడుతున్న మిషన్ భగీరథ పనులను ఆమె పరిశీలించారు. అదేవిధంగా నాగకర్నూల్ సమీపంలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిప్ట్-3ని పరిశీలించారు. సొరంగం మార్గాన వెళ్లిన ఆమె ప్రాజెక్టు సంబంధించిన పనుల పురోగతిపై ఆరా తీశారు. పనుల ఆలస్యంగా జరుగుతుండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. కల్వకుర్తి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని అక్కడే ఉన్న అధికారులకు సూచించారు. గౌరిదేవిపల్లి దగ్గర జరుగుతున్న మిషన్ భగీరథ పనులను సైతం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో రూ. 6880 కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని దశలకు సంబందించిన పనులకు ఎలాంటి అవంతారాలు లేవని, అటవీ అనుమతులు కూడా వచ్చాయని తెలిపారు. ఇక పనులు వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రత్యేకంగా భావిస్తున్నారని, ఏడాది లోపు జిల్లాలో సగానికి పైగా పనులు పూర్తి చేసి దాదాపు 600కి పైగా గ్రామ పంచాయతీలకు నల్లాల ద్వారా తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో హరితహరం ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి, వాటర్‌గ్రిడ్ సిఈ కృపాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జూరాలలో డెడ్‌స్టోరేజీకి నీటిమట్టం

ఆయకట్టు రైతుల్లో ఆందోళన
కుడి, ఎడమ హెడ్ రెగ్యులేటర్లకు అందని నీరు
ఎండిపోతున్న వరిపైర్లు..బీటలు వారిన ఆయకట్టు

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 13: మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణానదిపై గల జూరాల ప్రాజెక్టులో నీటి సా మర్థ్యం తగ్గిపోయి డెడ్‌స్టోరేజీకి చేరుకుంది. దాంతో వేలాది మంది ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. 11 టిఎంసిల నీటి సామర్థ్యానికి గాను కేవలం అధికారికంగా ప్రస్తుతం 4 టిఎంసిలు మాత్రమే ఉందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టులో నీటి సామర్థ్యం తగ్గిపోయి డెడ్‌స్టోరేజీకి చేరుకోవడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, ఒండ్రుమట్టి పేరుకుపోవడం, ప్రాజెక్టులో అడుగుభాగం పూడుకుపోవడంతో జూరాల ప్రాజెక్టులో కేవలం 3 టిఎంసిల నీరు మాత్రమే నీరు ఉందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి పడిపోయింది. దాదాపు 10 రోజుల నుండి ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేసే ప్రక్రియకు అధికారులు నిలిపివేశారు. అంతేకాకుండా కుడి, ఎడమ కాలువల హెడ్ రెగ్యులేటర్లకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. హెడ్ రెగ్యులేటర్లకు వచ్చే నీటి ప్రవహం గల కాలువలు పూర్తిగా ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. దీంతో ఆయకట్టుకు నీరు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఎడమ కాలువ పరిధిలో డిస్టిబ్యూటర్-6వ కాలువ కింద దాదాపు 2000 ఎకరాలకు పైగా ఆయకట్టుకు సంబంధించిన వరి పైర్లు ఎండుముఖం పట్టాయి. ఎడమ కాలువ పరిధిలోని నందిమళ్ల, మూలమళ్ల, జూరాల, తిప్పడంపల్లి, సత్తిపల్లి, వీరరాఘపురం, రేచింతల ప్రాంతాల్లో గల 3000 ఆయకట్టుకు నీరు లేక సాగుచేసిన వరి పైర్లు బీటలు పారాయి. కుడి కాలువ పరిధిలో కూడా ఆయకట్టుకు నీటిని నిలిపివేయడంతో ఆ ప్రాంతంలో దాదాపు 2500 ఎకరాలకుపైగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. శనివారం గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ బీటలు వారిన పంటలను పరిశీలించారు.
రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆమె డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని కొంతైన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రాజెక్టు నీటి మట్టం డెడ్‌స్టోరేజీకి పడిపోవడం రైతులను కలవరానికి గురిచేస్తోంది. మొదటి ఆయకట్టు రైతులే ఆందోళన చెందుతుండగా మధ్య, చివరి ఆయకట్టు రైతులు మాత్రం తమ పంటలు ఇక ఎండిపోయినట్లేనని పంటలపై ఆశలు వదులుకున్నారు. జూరాల ఆయకట్టులోని కుడి, ఎడమ కాలువల పరిధిలో మొత్తం దాదాపు పది వేల ఎకరాలకుపైగా వరి పైర్లు బీటలు వారాయి. మరో వారం పది రోజులు అయితే సాగుచేసిన పంటల్లో సగానికిపైగా ఎండుముఖం పట్టే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు ఈ దుస్థితి ఫిబ్రవరిలోనే రావడానికి ముఖ్యకారణం ఎగువ ప్రాంతంలోని కర్ణాటక పరిధిలోగల నారాయణపూర్ డ్యాం నుండి గత మూడు మాసాల నుండి చుక్కానీరు కూడా రాకపోవడమే జూరాల ప్రాజెక్టు నీటి సామర్థ్యం డెడ్‌స్టోరేజీకి పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో కృష్ణానదిపై నిర్మించిన రోడ్ కమ్ బ్రిడ్జి అక్రమ ప్రాజెక్టులు కూడా ఇందుకు కారణమని రైతులు భావిస్తున్నారు. మరోసారి జూరాల ఆయకట్టు రైతులు రోడ్లపైకి వచ్చే అవకాశాలు ఉండడంతో సంబంధిత అధికారులు పంటలను కాపాడేందుకు కృష్ణా బోర్డుకు జూరాల 2 టిఎంసిల నీరు కావాలని లేఖలు రాశారు. కృష్ణా బోర్డు కనికరిస్తే తప్పా జూరాల ఆయకట్టు రైతుల పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఏదేమైనప్పటికీ జూరాల ఆయకట్టు రైతుల్లో మాత్రం ఆందోళన మొదలైంది.