తెలంగాణ

బాసర భక్తజన జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర: దక్షిణభారతదేశంలోని ఏకైక చదువుల తల్లి నిలయమైన ఆదిలాబాద్ జిల్లా బాసర శ్రీ జ్ఞానసరస్వతిదేవి నిలయంలో వసంత పంచమి ఉత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి. శనివారం సైతం భక్తులు బాసర క్షేత్రానికి పోటెత్తారు.
పంచమి ఉదయం 11 గంటలకు శుభఘడియలు ఉండడంతో తెల్లవారుజామునుండే ప్రత్యే క సాధారణ అక్షరస్వీకార పూజల కోసం భక్తులు, చిన్నారులు క్యూలైన్‌లో బారులు తీరారు. అమ్మవారి చెంత తమ చిన్నారులకు అక్షర స్వీకార పూజలు నిర్వహించేందుకు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు పోటెత్తారు. శనివారం ఒక్కరోజే 2550 మంది చిన్నారులకు ఆలయ అర్చకులు ఘనంగా అక్షర స్వీకార పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఆలయంలో కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకుని మొక్కు లు చెల్లించుకున్నారు. ఈ శుభఘడియలు మధ్యాహ్నం వరకే ఉండడంతో అక్షర స్వీకార పూజల కోసం భక్తులు క్యూలైన్‌లలో గంటల తరబడి వేచివున్నారు. అక్షర స్వీకార పూ జలకు ఒక్కో బ్యాచ్‌కు 4 గంటల సమయం పట్టడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గుర య్యారు. ఆలయ అధికారులు క్యూలైన్‌లలో బిస్కెట్లు, పాలు ఉచితంగా అందజేశారు. అక్షర స్వీకార పూజల క్యూలైన్ ఆలయం నుండి తిరుమల తిరుపతి దేవస్థాన వసతి భవనం వరకు చేరింది. బాసర ఎస్సై నర్సింగ్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆర్జిత సేవలు, ప్రసాదాల విక్రయాల ద్వారా ఆలయానికి రూ.18 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు పేర్కొన్నారు. సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.