తెలంగాణ

యుద్ధప్రాతిపదికన దేవాదుల రీడిజైనింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేవాదుల రీ డిజైనింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేసి సాగునీటిని అందించాలని అన్నారు. దేవాదుల ఫేజ్ 3, ప్యాకేజీ 2,3 పనుల పురోగతిపై మంత్రి సమీక్ష జరిపారు. జనగామ, పాలకుర్తి నియోజకవర్గాలకు ఎఫ్‌ఎఫ్‌సి ద్వారా నీటి సరఫరాపై చర్చించారు. దేవాదుల ఫేజ్ 3ప్యాకేజీ పనుల్లో భీం ఘన్‌పూర్ జలాశయం నుండి రామప్ప జలాశయం వరకు నీటిని పంప్ చేయాల్సి ఉంటుందన్నారు. పంప్ హౌస్ నిర్మాణంతోపాటు టనె్నల్ తవ్వకం ప్రధానమైన విషయమని చెప్పారు. టనె్నల్ తవ్వకాల కోసం జరిపే బ్లాస్టింగ్ వల్ల రామప్ప గుడికి ముప్పు ఉంటుందని ప్రజల నుండి ఆందోళన వ్యక్తం కావడంతో ప్రభుత్వం పనులు నిలిపివేసింది.
టనె్నల్‌కు ప్రత్యామ్నాయంగా అదే అలైన్‌మెంట్‌లో పైప్‌లైన్ నిర్మాణానికి ఆదేశించింది. దీంతో తమకు ఇబ్బందులు ఎదరవుతున్నాయని కాంట్రాక్టర్లు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. దుమ్ముగూడెం ప్రాజెక్టుపైనా మంత్రి సమీక్ష జరిపారు. కాంట్రాక్ట్ క్లోజర్‌కు సంబంధించిన అంశాలపై చర్చించారు. అగ్రిమెంట్లను మూసివేయడానికి అంగీకరిస్తే, కాంట్రాక్టర్లకు సెక్యూరిటీ డిపాజిట్లు, బీమా నిధులు, బీజీల కోసం చెల్లించిన బ్యాంకు కమీషన్లు తిరిగి చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును సమీక్షిస్తూ... వచ్చే సీజన్‌లో ఎల్లంపల్లి జలాశయాన్ని ఎఫ్‌ఆర్‌ఎల్ 148 మీటర్ల వరకు నింపి 20 టిఎంసిలు నిల్వ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు.

వెబ్‌సైట్‌లో ఎఇ పోస్టులకు
ఎంపికైనవారి జాబితా
తెలంగాణ జెన్‌కో వెల్లడి
ఆంధ్రభ్రూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 13: తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పొరేన్ (జెన్కో) నిర్వహించిన ఎఇ ఉద్యోగాల ఫలితాలను ప్రకటించినట్లు ఆ సంస్థ డైరక్టర్ ఎస్.అశోక్‌కుమార్ తెలిపారు. జెన్‌కో అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫలితాలు పొందుపర్చినట్లు వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు గత ఏడాది నవంబర్ 14న రాత పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 14 నుంచి 17 వరకు ఎర్రగడ్డలోని జెన్‌కో బిల్డింగ్‌లో జరిగే సర్ట్ఫికెట్ల పరిశీలనకు తన ఒరిజినల్ సర్ట్ఫికెట్లతో హాజరు కావాలని డైరక్టర్ సూచించారు.

19న మేడారానికి
సిఎం కెసిఆర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 13: సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. 17న సారలమ్మ, 18న సమ్మక్క గద్దెపైకి వస్తారని తెలిపారు. ఈ రెండు రోజులు జనం ఎక్కువ సంఖ్య లో వచ్చే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఏ ర్పాట్లు చేసినట్టు చెప్పారు. జంపన్న వాగు వరకు మినీ బస్సుల్లో జనాన్ని తరలించనున్నట్టు తెలిపారు. భక్తుల కోసం ఈనెల 16 నుంచి తాగునీటిని అందుబాటులోకి తీసుకు రానున్నారు. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. తెలంగాణ సాకారం అయినందుకు ఈనెల 19న ముఖ్యమంత్రి కెసిఆర్ మొక్కులు చెల్లిస్తారని తెలిపారు.
అలరించిన తెలంగాణ
కళాకారుల ప్రదర్శనలు
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: హర్యానాలో జరుగుతున్న అంతర్జాతీయ సూరజ్ కుండ్ హస్తకళల మేళాలో తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. శనివారం జరిగిన ఫ్యాషన్ షో అందర్నీ అలరించింది. మోడళ్లు చేనేత వస్త్రాలు ధరించి షోలో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమానికి స్పీకర్ మధుసూదనాచారి, మండలి చెర్మన్ స్వామిగౌడ్, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి పాల్గొన్నారు. సూరజ్‌కుండ్ మేళా ఈ నెల 15 ముగియనుంది.
బిహార్‌లో బాలిక రేప్ కేసు
ఆర్‌జెడి ఎమ్మెల్యే
అరెస్టుకు ఆదేశాలు
పాట్నా, ఫిబ్రవరి 13: ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అధికార ఆర్‌జెడి ఎమ్మెల్యే రాజ్ బల్లభ్ యాదవ్ అరెస్టుకు శనివారం ఆదేశాలు జారీ అయ్యాయి. నవాడకు చెందిన 15 ఏళ్ల బాలిక ఈ నెల 6న ఎమ్మెల్యే తనను రేప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డిఐజి శాలిని శనివారం ఒక వార్తాసంస్థకు చెప్పారు. బాలిక ఫిర్యాదు మేరకు నలంద మహిళా పోలీసు స్టేషన్‌లో ఈ నెల 9న కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తొలుత నిందితుడి ఫొటోను గుర్తుపట్టిన బాధిత బాలిక, తరువాత నేరుగా మనిషిని కూడా గుర్తుపట్టినట్లు డిఐజి వివరించారు. గతంలో ఆర్‌జెడి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన యాదవ్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఆర్‌జెడి టికెట్‌పై నవాడ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ప్రాణహిత-చేవెళ్ళపై
ప్రత్యేక అసెంబ్లీ: షబ్బీర్ అలీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 13: ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించాలని లేదా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాణహిత-చేవెళ్ళపై ముఖ్యమంత్రి ఇంతవరకు స్పష్టత ఇవ్వడం లేదని ఆయన శనివారం పార్టీ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు.

బిఎస్‌ఎఫ్ జవానును
హతమార్చిన నక్సలైట్లు
రాయ్‌పూర్, ఫిబ్రవరి 13: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులుగా అనుమానిస్తున్న వ్యక్తులు శనివారం నిరాయుధుడయిన ఒక బిఎస్‌ఎఫ్ జవానును కాల్చి చంపారు. బిఎస్‌ఎఫ్‌లోని ఇంటెలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న హరికేశ్ ప్రసాద్ శనివారం ఉదయం పది గంటల ప్రాంతంలో వ్యక్తిగత పనిమీద సివిల్ దుస్తుల్లో ఎలాంటి ఆయుధం లేకుండా సంగం గ్రామంలోని మార్కెట్ ఏరియాకు వెళ్లారు. ఆ సమయంలో నక్సలైట్లు అతి సమీపంనుంచి అతనిపై కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ప్రసాద్‌ను రాష్ట్ర రాజధాని అయిన రాయ్‌పూర్‌లోని ఒక ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అతను చికిత్స పొందుతూ మధ్యా హ్నం రెండు గంటలకు తుదిశ్వాస విడిచారు.

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత
కురూప్ కన్నుమూత

తిరువనంతపురం, ఫిబ్రవరి 13: జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ప్రముఖ మలయాళ కవి ఒఎన్‌వి కురూప్ శనివారం కన్నుమూశారు. గేయ రచయిత, పర్యావరణవేత్త కూడా అయిన 84 ఏళ్ల కురూప్ ఇక్కడి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కురూప్‌ను రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి వెంటిలేటర్ సహాయంతో శ్వాస తీసుకుంటున్న ఆయన శనివారం సాయంత్రం 4.49 గంటలకు గుండె పోటు రావడం వల్ల కన్నుమూశారు. కురూప్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ఆయన మంత్రివర్గ సహచరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

బిఎస్‌ఎఫ్ జవానును
హతమార్చిన నక్సలైట్లు
రాయ్‌పూర్, ఫిబ్రవరి 13: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులుగా అనుమానిస్తున్న వ్యక్తులు శనివారం ఒక బిఎస్‌ఎఫ్ జవానును కాల్చి చంపారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న హరికేశ్ ప్రసాద్ శనివారం ఉదయం పది గంటల ప్రాంతంలో వ్యక్తిగత పనిమీద సివిల్ దుస్తుల్లో సంగం గ్రామంలోని మార్కెట్ ఏరియాకు వెళ్లారు. ఆ సమయంలో నక్సలైట్లు అతి సమీపంనుంచి అతనిపై కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. గాయపడిన ప్రసాద్‌ను రాయ్‌పూర్‌లోని ఒక ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అతను చికిత్స పొందుతూ మధ్యాహ్నం రెండు గంటలకు తుదిశ్వాస విడిచారు. 122వ బిఎస్‌ఎఫ్ బెటాలియన్‌కు చెందిన ప్రసాద్ నక్సలైట్ల వ్యతిరేక కార్యకలాపాలలో భాగంగా జిల్లాలో ఇంటెలిజెన్స్ విభాగంలో విధులు నిర్వహిస్తూ వచ్చారు.