తెలంగాణ

బిసి గురుకులాల్లో 3570 పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: తెలంగాణ రాష్ట్రంలో 119 వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలను ప్రారంభించేందుకు పరిపాలనాపరమైన అనుమతి ఇవ్వడంతో, వీటిలో పనిచేసేందుకు 3,570 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే 476 మందిని ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. వెనుకబడిన తరగతుల శాఖకు సంబంధించి గురుకుల విద్యా సంస్థల సొసైటీలో 49పోస్టులను మంజూరు చేస్తూ, మరో 16 మందిని ఔట్‌సోర్స్ విధానంలో నియమించుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె. రామకృష్ణారావుపేరుతో సోమవారం రెండు జీఓలు వెలువడ్డాయి.
గురుకుల పాఠశాలల్లో పనిచేసేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. 119 ప్రిన్సిపాల్ పోస్టులు, 833 జూనియర్ లెక్చరర్లు, 833 మంది పిజిటిలు, 119 ఫిజికల్ డైరెక్టర్లు, 119 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, 119 మంది లైబ్రేరియన్లు, 119 మంది క్రాఫ్ట్, ఆర్ట్, మ్యూజిక్ ఇన్‌స్ట్రక్టర్లు, 119 స్ట్ఫా నర్సులు, 119 సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు మంజూరు ఇచ్చారు. దశలవారీగా మూడు సంవత్సరాల్లో ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.
గురుకుల సంస్థల సొసైటీలో ఒక కార్యదర్శి, ఇద్దరు సంయుక్త కార్యదర్శులు, ముగ్గురు డిప్యూటీ కార్యదర్శులు, నలుగురు సహాయ కార్యదర్శులు, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఒక అకౌంట్స్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఒక విజిలెన్స్ ఆఫీసర్, ఒక స్పోర్ట్స్ ఆఫీసర్, ఇద్దరు కంటెంట్ మేనేజర్లు, ఎనిమిది మంది సూపరింటెండెంట్లు, 8 మంది సీనియర్ అసిస్టెంట్లు,16 మంది జూనియర్ అసిస్టెంట్ల పోస్టులను భరీ చేసేందుకు అనుమతి ఇచ్చారు. నిబంధనలకు అనుగుణంగా ఈ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ చేపట్టాలని రామకృష్ణారావు ఈ జీఓల్లో స్పష్టం చేశారు.