తెలంగాణ

నేడు గద్దెపైకి సారలమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: కనె్నపల్లి ఆడబిడ్డ, మేడారం జాబిలి, భక్తుల ఆరాధ్య దైవం సారలమ్మ బుధవారం గద్దెపై కొలువుదీరనుంది. సారలమ్మ గద్దెపై కొలువుతీరిన సన్నివేశాన్ని తమ కనులారా వీక్షించడానికి లక్షలాదిమంది ఎదురుచూస్తున్నారు. తమ ఊరి ఆడపడుచును తల్లి చెంతకు చేర్చడానికి కనె్నపల్లి గ్రామం ముస్తాబైంది. కనె్నపల్లి గ్రామంలో ప్రతిఒక్కరూ తమ ఇంటి ముందు అలుకుపూత, ఇంటి గోడలకు పుట్టమన్ను, ఎర్రమట్టి పూసి వాటిపై అందమైన ముగ్గులు వేసి తమ ఇళ్లను అలంకరించడంతో కనె్నపల్లి గ్రామం మరింత అందంగా మారింది. బుధవారం మధ్యాహ్నం నుండి సారలమ్మను గద్దెకు తీసుకువచ్చే కార్యక్రమం మొదలవుతుంది. బుధవారం మధ్యాహ్నం కనె్నపల్లిలోని సారలమ్మ గుడిలో సుమారు రెండు గంటల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కనె్నపల్లి వెనె్నలయిన సారలమ్మ రాకకోసం అనేకమంది మహిళా భక్తులు పొర్లు దండాలు పెడుతూ గుడి ముందు మోకరిల్లుతారు. సారలమ్మకు కనె్నపల్లి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆదివాసి ఆచార ప్రకారం డప్పు చప్పుళ్ళు, మేళ తాళాలు, అమ్మా సారలమ్మ తల్లీ .. చల్లంగా చూడు తల్లీ అంటూ భక్త జనం చేసే సారలమ్మ నామస్మరణ మధ్య సారలమ్మ కనె్నపల్లి గుడి నండి బయలుదేరిన సారలమ్మ దారి మధ్యలో జంపన్నవాగు వద్ద తన తమ్ముడు జంపన్నను ఆత్మీయంగా పలకరించి, ఆలింగనం చేసుకుని మేడారంలోని గద్దెకు చేరుకుంటుంది.
పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు
మేడారంలో కొలువైన తన భార్య, బిడ్డలను కలుసుకునేందుకు జిల్లాలోని కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుండి బైలెళ్లిన పగిడిద్దరాజు బుధవారం మేడారంలో గద్దెపై కొలువుదీరనున్నాడు. పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజును మేడారం వరకు సాగనంపేందుకు పూనుగొండ్లలో సర్వం సిద్ధం చేసారు. పూనుగొండ్లలోని ఇళ్లన్నీ శుద్ధి చేసుకుంటారు. పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పగిడిద్దరాజు పూజారులు పగిడిద్దరాజును తీసుకుని బుధవారానికి మేడారం చేరుకుంటారు.
కొండాయి నుండి గోవిందరాజు
ఏటూరునాగారం మండలంలోని కొండాయిలో ఉన్న గోవిందరాజు కూడా బుధవారం మేడారంలోని గద్దెపై కొలువుతీరనున్నాడు. కొండాయిలోని గోవిందరాజు ఆలయంలో అభిషేకాలు నిర్వహించి, గోవిందరాజు పూజకు చెందిన పూజాసామాగ్రిని శుద్ధి చేస్తారు. కొండాయి గ్రామంలోని అన్ని ఇళ్లను అలికి, ముగ్గులు వేసి అలంకరిస్తారు. గోవిందరాజుల ప్రధాన పూజారి, వడ్డెలు ముందుగా తమ ఇళ్లను శుద్ధి చేసుకుని అటుపిమ్మట భక్తిశ్రద్ధలతో గోవిందరాజు ఆలయాన్ని శుద్ధి చేస్తారు. కొండాయి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బుధవారం మధ్యాహ్నం కొండాయి నుండి గోవిందరాజు మేడారం చేరుకుని గద్దెపై కొలువుతీరుతాడు. పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మలు ముగ్గురు బుధవారం గద్దెలపై కొలువుతీరనుండడంతో ఈ అపురూప క్షణాలకోసం లక్షలాదిమంది భక్తులు ఎదురుచూస్తున్నారు.

భారీ బందోబస్తు
నేటి నుండి మేడారం జాతర ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, ఫిబ్రవరి 16: నాలుగు రోజుల పాటు వైభవంగా జరిగే మేడారం మహా జాతరకు బుధవారం నుంచి ప్రారంభం కానుంది. మహాజాతరగా వినుతికెక్కిన మేడారం జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క - సారలమ్మల పేరిట జరిగే ఈ జాతర వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరుగుతుండడం వల్ల దీనికి మేడారం జాతరగా పేరొచ్చింది. మేడారం గ్రామంలోని గద్దెలకు మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న కనె్నపల్లి గ్రామంలో సారలమ్మ దేవత కొలువైంది. కనె్నపల్లి నుండి ప్రధాన పూజారి కాక సారయ్య ఆ దేవతను గద్దెకు తీసుకురావడంతో మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది. సారలమ్మ గద్దెకు రావడంతో జాతర పనుల్లో వేగం పుంజుకుంది. భక్తులలో ఉత్సాహం రెట్టింపు అయింది. పూజాది కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. మరుసటి రోజు గురువారం సాయంత్రం చిలకలగుట్ట నుండి సమ్మక్క తల్లిని గద్దెకు తీసుకొస్తారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠించిన దగ్గరి నుండే భక్తులు మొక్కులు చెల్లించుకోవడం ప్రారంభిస్తారు. శుక్రవారం ఇద్దరు దేవతలు గద్దెపై కొలువుదీరడంతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.
మేడారం జాతర ప్రాంతాన్ని 38 సెక్టార్లుగా విభజించారు. మేడారం జాతర సందర్భంగా 10వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 50 మంది డిఎస్పీలు, 150 మంది సిఐలు, 200 మంది ఎస్సైలు, మిగతా పోలీసు సిబ్బంది జాతర బందోబస్తు నిర్వహిస్తున్నారు. తల్లుల గద్దెల చుట్టూ నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. ముఖ్యకూడళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు జాతరకు చేరుకున్నారు. మహాజాతరకు ఆర్టీసీ 4 వేల ప్రత్యేక బస్సులతో ప్రయాణికులను చేరవేస్తుంది. దాదాపు పాతిక లక్షల మంది ప్రయాణికులను చేరవేసే లక్ష్యంతో ఉన్న ఆర్టీసీ అవసరమనుకుంటే మరిన్ని ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయనుంది.

19న కెసిఆర్ రాక
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 19న మేడారం జాతరకు రానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైతే తల్లులను దర్శించుకుంటానని మొక్కుకున్నానని, ఆ మొక్కు తీర్చుకోవడానికే మేడారం వస్తున్నట్లు ఆయన ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత తొలిసారి జరుగుతున్న మేడారం మహాజాతర కావడం తల్లుల దర్శనానికి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ విచ్చేస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా దాదాపు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, జిల్లా ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా ఇక్కడే తిష్టవేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఏర్పాట్లు పూర్తి
వరంగల్ కలెక్టర్ కరుణ
ఆంధ్రభూమి బ్యూరో
మేడారం, ఫిబ్రవరి 16: ప్రభుత్వపరంగా తీసుకోవలసిన అన్ని జాగ్రత్త చర్యలను మేడారం జాతరలో తీసుకున్నామని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవార్లదర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు పూర్తి చేసామని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝాలు స్పష్టం చేశారు. మేడారంలోని ఐటిడిఎ విశ్రాంతి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ట్రాఫిక్ వన్‌వే ఆంక్షలను అమలులోకి తీసుకువచ్చామని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలుగవద్దనే వన్‌వే నిర్ణయం తీసుకున్నామని, భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. హైదరాబాద్ నుండి వచ్చే భక్తులను పరకాల బయ్యక్కపేట మీదుగా మేడారం మరలిస్తున్నామని, చత్తీస్‌ఘడ్ నుండి వచ్చే వారిని చిన్న బోయినపల్లి నుండి ఊరట్టం మీదుగా మేడారం మళ్లిస్తున్నామన్నారు. కరీంనగర్ నుండి వచ్చే భక్తులను కాటారం, సింగారం మీదుగా దారిమళ్లిస్తున్నామని, తిరుగు ప్రయాణం మాత్రం బయ్యక్కపేట, భూపాలపల్లి మీదుగా భక్తులు క్షేమంగా వెళ్లాలని వారు సూచించారు. అత్యవసర సేవల కోసం ట్రాఫిక్ ఆంక్షలను సడలించేందుకు సిద్ధంగా ఉన్నామని, కొత్తదారులు పెరగడం వల్ల మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూస్తున్నా మన్నారు. భక్తులను చేరవేసేందుకు జాతర ప్రాంగణంలో 20 ఆర్టీసి బస్సులను సిద్ధంగా ఉంచామన్నారు. ఇప్పటికే 38 మంది సెక్టోరియల్ అధికారులు భక్తులకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. జాతర ప్రాంగణంలో 52 నీటి ట్యాంకర్లతో భక్తులకు మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు.

, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కంపాటి, ఐటిడిఏ పిఓ అమయ్‌కుమార్, ములుగు ఆర్డీఓ మహేందర్‌జీ తదితరులు పాల్గొన్నారు.

మావోయిస్టు కీలక నేత
సాంబయ్య లొంగుబాటు
భద్రాచలం, ఫిబ్రవరి 16: ఖమ్మం జిల్లా భద్రాచలం ఏఎస్పీ, ఇంఛార్జ్ ఓఎస్‌డీ ఆర్.్భస్కరన్ ఎదుట మంగళవారం సాయంత్రం మావోయిస్టు కీలక నేత లొంగిపోయారు. కోడూరి సాంబయ్య అలియాస్ తాత అనే ఇతను 1980వ సంవత్సరం నుంచి రాడికల్స్, రైతుకూలీ సంఘం, పీపుల్స్‌వార్‌లల్లో కీలక బాధ్యతలు నిర్వహించి 1991లో అప్పటి వరంగల్ ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఇతను వరంగల్ జిల్లా రేగొండ మండలం కాకర్లపల్లి గ్రామవాసి. 1996లో మళ్లీ వరంగల్ జిల్లా రేగొండ పీపుల్స్ వార్ దళంలో చేరాడు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడుగా పనిచేస్తున్నారు. అనారోగ్యంతో పాటు మావోయిస్టు పార్టీపై పెరిగిన తీవ్ర నిర్బంధం నేపథ్యంలో లొంగిపోయినట్లు ఆయన చెప్పారు. ఇతనిపై రూ.8లక్షల రివార్డు ఉందని, అతనికే వాటిని అందించి పునరావాసం కల్పిస్తామని ఏఎస్పీ భాస్కరన్ తెలిపారు.

కృష్ణాడెల్టాకు నీటి సరఫరా నిలిపివేత
సాగర్ జలాశయానికి నిలిచిన ఇన్‌ఫ్లో
విజయపురిసౌత్, ఫిబ్రవరి 16: నాగార్జున సాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా కృష్ణాడెల్టాకు సరఫరా చేస్తున్న నీటిని మంగళవారం నిలిపివేశారు. శ్రీశైలం జలాశయం నుండి నాగార్జున సాగర్‌కు నీటి చేరిక పూర్తిగా నిలిచిపోయింది. తాగునీటి ఎద్దడిని నివారించేందుకు కృష్ణ రివర్‌బోర్డ్ ఆదేశాల మేరకు శ్రీశైలం జలాశయం నుండి 11.5 టీఎంసీల నీరు సాగర్ జలాశయానికి వచ్చి చేరింది. 4.5 టీఎంసీల నీటిని కృష్ణాడెల్టాకు కొనసాగించారు. నీటి సామర్ధ్యం పూర్తికావడంతో కృష్ణా రివర్‌బోర్డ్ ఆదేశాల మేరకు కృష్ణాడెల్టాకు నీటిని నిలిపివేశారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 509 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఇది 129.9780 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుండి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి నీటి సరఫరా నిలిచిపోవడంతో సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.