తెలంగాణ

కాంట్రాక్టు లెక్చరర్ సర్వీసుల క్రమబద్ధీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ జాప్యమైతే వేతనాలు పెంచుతామని తెలిపారు. కోర్టుల్లో కేసులు ఉపసంహరించుకుంటే లెక్చరర్లకు పదోన్నతులు కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వ కాలేజీల ప్రతిష్ట పెరిగేలా లెక్చరర్లు పనిచేయాలని, అవినీతిని అరికట్టేందుకు అన్ని విద్యాసంస్థలను ఆన్‌లైన్ చేశామని ఆయన చెప్పారు. ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ విగ్రహాన్ని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులు క్రమబద్ధం చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ బోర్డులో అన్ని సేవలను ఆన్‌లైన్ చేయడం వల్ల అవినీతిని అరికట్టగలిగామని, మిగిలిన సర్వీసులను కూడా ఆన్‌లైన్ చేసి అవినీతిని నిర్మూలిస్తామని అన్నారు. జూనియర్ కాలేజీలకు ఈ ప్రభుత్వం ఇచ్చినన్ని నిధులు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. గత రెండేళ్లలో 311 కోట్లు ఇచ్చిందని అన్నారు. 2017 నాటికి అన్ని కాలేజీలకు పక్కా భవనాలు, వసతులు ఉండేలా చూస్తామని అన్నారు.
ఇంటర్ ఉచిత విద్య, పుస్తకాలు ఇవ్వడం వల్ల విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. దీనికోసం పాటు పడిన లెక్చరర్లను ఆయన అభినందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని కమిషనర్ వాణి ప్రసాద్ పేర్కొన్నారు. 33 కాలేజీలకు ఒకే రోజు భవనాలను ఏర్పాటు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌జిఓ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, ఎమ్మెల్సీ జనార్ధనరెడ్డి పాల్గొనగా కార్యక్రమానికి డాక్టర్ మధుసూధనరెడ్డి అధ్యక్షత వహించారు.