తెలంగాణ

జంతు కళేబరాలతో నూనె తయారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివనగర్: జంతువుల మాంసంతో నూనె తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావుపేట్ గ్రామ శివారులో మంగళవారం జరిగింది. సదాశివనగర్ పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గత కొద్దినెలలుగా ధర్మారావుపేట్ గ్రామ శివారులో జంతువుల కళేబరాలు, కొవ్వు, మాంసంతో నూనె తయారు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సదాశివనగర్ ఇంచార్జి ఎస్‌ఐ నవీన్‌కుమార్, ఎఎస్‌ఐ వెంకట్‌రావు, తహశీల్దార్ రమేశ్ దాడి చేశారు. సర్వే నెంబర్ 387, 549లో గత కొద్దినెలలుగా హైదరాబాద్, మహారాష్ట్ర, నిజామాబాద్ జిల్లాకు చెందిన కళేబరాల స్మగ్లర్లు నూనె తయారు చేస్తున్నారు. కళేబరాల నుండి వచ్చిన వస్తువులను పెద్ద కడాయిల్లో ఉడికించి నూనెను తీస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ధర్మారావుపేట్ గ్రామానికి మొయనొద్దీన్‌తో పాటు నిజామాబాద్‌కు చెందిన రంజిత్‌సింగ్, మహేంద్రసింగ్ పాత్ర ఉందని పోలీసులు పేర్కొన్నారు. మొయనొద్దీన్‌కు చెందిన వ్యవసాయ భూమిలో నూనె తయారీ కేంద్రం ఏర్పాటు చేయడంతో ఎవరి దృష్టిలో పడలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు నూనె కేంద్రంపై దాడి చేసి మోహినొద్దీన్‌తో పాటు అక్కడే పనిచేస్తున్న అర్సపల్లికి చెందిన శ్యాం, హైదరాబాద్‌కు చెందిన కరీం, నిజామాబాద్‌కు చెందిన అన్వర్, రాజులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు కూడా అక్కడికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నూనె తయారీ కడాయిలు, డ్రమ్ములను ధ్వంసం చేసి భూమిలో పాతిపెట్టాలని తహశీల్దార్ సిబ్బందిని ఆదేశించారు. ఈ దాడుల్లో రెవెన్యూ సిబ్బంది శృతి, రాములు, రవి, పోలీస్ సిబ్బంది చారి, భూమయ్య, వెంకట్‌రెడ్డి, అంబారీసింగ్, శేఖర్, సర్పంచ్ వాణివిద్యాధర్‌రావు ఉన్నారు.

కృష్ణాడెల్టాకు నీటి సరఫరా నిలిపివేత
విజయపురిసౌత్, ఫిబ్రవరి 16: నాగార్జున సాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా కృష్ణాడెల్టాకు సరఫరా చేస్తున్న నీటిని మంగళవారం నిలిపివేశారు. శ్రీశైలం జలాశయం నుండి నాగార్జున సాగర్‌కు నీటి చేరిక పూర్తిగా నిలిచిపోయింది. తాగునీటి ఎద్దడిని నివారించేందుకు కృష్ణ రివర్‌బోర్డ్ ఆదేశాల మేరకు శ్రీశైలం జలాశయం నుండి 11.5 టీఎంసీల నీరు సాగర్ జలాశయానికి వచ్చి చేరింది. 4.5 టీఎంసీల నీటిని కృష్ణాడెల్టాకు కొనసాగించారు. నీటి సామర్ధ్యం పూర్తికావడంతో కృష్ణా రివర్‌బోర్డ్ ఆదేశాల మేరకు కృష్ణాడెల్టాకు నీటిని నిలిపివేశారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 509 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఇది 129.9780 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుండి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి నీటి సరఫరా నిలిచిపోవడంతో సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.
మావోయిస్టు కీలక నేత లొంగుబాటు
భద్రాచలం, ఫిబ్రవరి 16: ఖమ్మం జిల్లా భద్రాచలం ఏఎస్పీ, ఇంఛార్జ్ ఓఎస్‌డీ ఆర్.్భస్కరన్ ఎదుట మంగళవారం మావోయిస్టు కీలక నేత లొంగిపోయారు. కోడూరి సాంబయ్య అలియాస్ తాత 1980వ సంవత్సరం నుంచి రాడికల్స్, రైతుకూలీ సంఘం, పీపుల్స్‌వార్‌లల్లో కీలక బాధ్యతలు నిర్వహించి 1991లో అప్పటి వరంగల్ ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఇతను వరంగల్ జిల్లా రేగొండ మండలం కాకర్లపల్లి గ్రామవాసి. 1996లో మళ్లీ వరంగల్ జిల్లా రేగొండ పీపుల్స్ వార్ దళంలో చేరాడు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడుగా పనిచేస్తున్నారు. అనారోగ్యంతో పాటు మావోయిస్టు పార్టీపై పెరిగిన తీవ్ర నిర్బంధం నేపథ్యంలో లొంగిపోయినట్లు ఆయన చెప్పారు. ఇతనిపై ఉన్న రూ.8లక్షల రివార్డును అతనికే ఇచ్చి పునరావాసం కల్పిస్తామని ఏఎస్పీ భాస్కరన్ తెలిపారు.

మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు.